భోపాల్: తన భర్తకు మద్యం, మాదకద్రవ్యాలతోపాటు అమ్మాయిలతో సంబంధాలు వంటి వ్యసనాలు ఉన్నాయని గవర్నర్ మనవడి భార్య ఆరోపించింది. (Alcohol, Drugs, Affairs) వరకట్నం కోసం వేధించడంతోపాటు తన కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ భార్య దివ్య గెహ్లాట్ మధ్యప్రదేశ్‌లోని రత్లాం ఎస్పీ అమిత్ కుమార్‌ను బుధవారం కలిసింది. ఉజ్జయినీ జిల్లా నాగ్డాలోని అత్తింటి వారు వరకట్నం కోసం తనను హింసించినట్లు ఆరోపించింది. 33 ఏళ్ల భర్త దేవేంద్ర గెహ్లాట్, అలోట్ మాజీ ఎమ్మెల్యే అయిన 55 ఏళ్ల మామ జితేంద్ర గెహ్లాట్, 25 ఏళ్ల బావమరిది విశాల్ గెహ్లాట్‌తో పాటు 60 ఏళ్ల అనితా గెహ్లాట్, పెళ్లి నాటి నుంచి రూ.50 లక్షల కట్నం డిమాండ్ చేస్తున్నారని, చాలా ఏళ్లుగా తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది.
కాగా, 2018 ఏప్రిల్ 29న ముఖ్యమంత్రి కన్యాదాన యోజన కింద నాటి కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ మనవడైన దేవేంద్ర గెహ్లాట్‌తో దివ్యకు పెళ్లి జరిగింది. అయితే అత్త వారింటికి చేరుకున్న తర్వాత తన భర్తకు పెళ్లికి ముందు నుంచే మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర మహిళలతో సంబంధాలు వంటి వ్యసనాలు ఉన్నట్లు తెలిసిందని దివ్య ఆరోపించింది. 2021లో గర్భవతిగా ఉన్నప్పుడు తరచుగా ఆహారం నిరాకరించారని, తనను కొట్టారని, మానసికంగా హింసించారని ఆరోపించింది. కుమార్తె పుట్టిన తర్వాత కూడా వేధింపులు కొనసాగినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు జనవరి 26న తాగి ఇంటికి వచ్చిన భర్త దేవేంద్ర గెహ్లాట్ తనను దారుణంగా కొట్టాడని, ఈ రోజు డబ్బు తీసుకురాకపోతే చంపేస్తానని బెదిరించాడని దివ్య ఆరోపించింది. తనను పైనుంచి తోసేయడంతో కింద ఉన్న గ్యాలరీలో పడినట్లు తెలిపింది. వెన్నెముక, భుజం, నడుముకు తీవ్ర గాయాలైనప్పటికీ రాత్రంతా వైద్యం అందించలేదని ఆరోపించింది. మరునాడు నాగ్డాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఇండోర్‌లోని బాంబే ఆసుపత్రికి రిఫర్ చేశారని తెలిపింది. వైద్య ఖర్చులు భరించమని తన తండ్రిపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది.
తన నాలుగేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేసి బలవంతంగా అత్తమామల వద్ద ఉంచుకున్నారని దివ్య ఆరోపించింది. నవంబర్‌లో తన కుమార్తెను చూడటానికి స్కూల్‌కు వెళ్లగా భర్త అడ్డుకున్నట్లు తెలిపింది. పేరెంట్స్ నుంచి డబ్బు తీసుకురాకపోతే కుమార్తెను కలవనీయబోనని భర్త హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం రత్లాంలోని పుట్టింట్లో ఉంటున్నానని, తన కుమార్తెను తనకు అప్పగించాలని అందులో కోరింది.
అయితే నాగ్డాలోని అత్త వారింట్లో ఆమె వేధింపులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఉజ్జయిని ఐజీ, ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు చేయాలని దివ్యకు రత్లాం ఎస్పీ సూచించారు. ఆమె నుంచి స్వీకరించిన ఫిర్యాదును కూడా నాగ్డా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే, దివ్య మామ జితేంద్ర గెహ్లాట్ ఈ ఆరోపణలపై స్పందించారు. ‘ఎవరైనా ఆరోపణలు చేయవచ్చు. నేను అన్ని వాస్తవాలను మీడియా ముందు బయటపెడతా’ అని అన్నారు.
Also Read:
Nitin Gadkari | ‘130 కిలోమీటర్ల వేగంతో మేం డ్రైవ్ చేయలేం’.. నితిన్ గడ్కరీ వీడియోపై కాంగ్రెస్ ఎంపీ
Woman Kills Girl | అందంగా ఉన్నదని బాలికను చంపిన మహిళ.. గతంలో కొడుకుతో సహా ముగ్గురు పిల్లలు హత్య
Watch: స్కూల్‌కు వెళ్లకుండా ఉండేందుకు.. బాలుడు ఏం చేశాడంటే?