ఖమ్మం సిటీ, మార్చి 12: ఖమ్మం వెలుగుమట్లలో నిజమైన భూదాన్ బాధితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు. గురువా రం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియా తో మాట్లాడారు. కొంతమంది అనర్హులు, అక్రమార్కులు, పైరవీకారులకు బుధవా రం పట్టాలు పంపిణీ చేశారని ఆరోపించా రు. తాము ఎనిమిదేండ్లుగా భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామని తెలిపారు.
కొందరు వ్యక్తులు తమ వద్ద డబ్బులు వసూళ్లు చేసి ఇండ్ల పట్టాలు ఇప్పిస్తామని మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం సక్రమంగా సర్వే జరిపించకుండా, అసలైన పేదలను గుర్తించకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. భూదాన్ భూముల్లో లేని వారికి పట్టాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
సర్వం కోల్పోయి రోడ్డు పాలైన తమలాం టి వారికి అన్యాయం చేయడం సరైందికాదని అన్నారు. మరోసారి సర్వే జరిపించి అసలైన బాధితులను ఆదుకోవాలని కోరా రు. సమావేశంలో బాధితులు సత్యనారాయణరెడ్డి, నరగాని కోటేశ్వరరావు, రవి, సీతారాములు, కల్యాణి, కవిత, జయమ్మ, సిరికొండ కల్యాణి, గాదె భాగ్యలక్ష్మి, పసుమర్తి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.