ఆది నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ ‘బుల్లెట్ రెడ్డి’. మేఘ, హనిక కథానాయికలు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. గురువారం ఈ సినిమా ప్రెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘బుల్లెట్రెడ్డి వెయ్యి ఎకరాల జమీందారు.
అతనికి చెందాల్సిన లక్షల కోట్ల విలువైన నిధిని దక్కించుకునేందుకు కొందరు దురాశాపరులు ఎలా ప్రయత్నించారు? ఆ ప్రయత్నాలను హీరో ఎలా తిప్పికొట్టాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఆసక్తికరమైన కథ, కథనాలతో ఈ సినిమా సాగుతుంది. రాజమండ్రి, అమలాపురం, గోవా, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపి అక్టోబర్ 16న సినిమా విడుదల చేస్తాం’ అని హీరో, దర్శక,నిర్మాత ఆది తెలిపారు. ఇంకా ఫైట్ మాస్టర్ ఖయ్యూం కూడా మాటాడారు.