Starship | స్పేస్ఎక్స్ చరిత్రలో మరో మైలురాయి.. హిందూ మహాసముద్రంలో సేఫ్ ల్యాండింగ్
Starship | అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రైవేట్ సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX) మరో చారిత్రక మైలురాయిని దాటింది. టెక్సాస్ (Texas) లోని బోకా చిగా వద్దగల స్టార్బేస్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన "స్టార్షిప్ ఫ్లైట్-13 (Starship Flight)" రోదసిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. భవిష్యత్తులో మానవులను చంద్రుడు, అంగారక గ్రహంపైకి తీసుకెళ్లేందుకు పూర్తిస్థాయి పునర్వినియోగ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు స్పేస్ఎక్స్ చేపట్టిన ఈ ప్రయోగం అంతరిక్ష చరిత్రలో ఎంతో కీలకమైనదిగా నిలిచింది.
Starship : అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రైవేట్ సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX) మరో చారిత్రక మైలురాయిని దాటింది. టెక్సాస్ (Texas) లోని బోకా చిగా వద్దగల స్టార్బేస్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన “స్టార్షిప్ ఫ్లైట్-13 (Starship Flight)” రోదసిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. భవిష్యత్తులో మానవులను చంద్రుడు, అంగారక గ్రహంపైకి తీసుకెళ్లేందుకు పూర్తిస్థాయి పునర్వినియోగ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు స్పేస్ఎక్స్ చేపట్టిన ఈ ప్రయోగం అంతరిక్ష చరిత్రలో ఎంతో కీలకమైనదిగా నిలిచింది.
శనివారం ఉదయం నింగిలోకి లేచిన ఈ అత్యంత శక్తిమంతమైన రాకెట్.. నిర్ణీత సమయానికి అంతరిక్షంలోకి చేరుకుంది. ప్రయోగం ప్రారంభమైన రెండు నిమిషాల తర్వాత ప్రధాన రాకెట్ నుంచి బూస్టర్ విభాగం వేరైంది. అయితే తిరోగమన దిశలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలో ల్యాండ్ కావాల్సిన ‘బూస్టర్-20’ రాకెట్ ఇంజిన్ స్టార్టింగ్ సమస్యలవల్ల నియంత్రణ కోల్పోయి సముద్రంలో ల్యాండ్ కాకుండా దెబ్బతింది. మరోవైపు ప్రధాన వ్యోమనౌక (స్టార్షిప్-40) అంతరిక్షంలో ప్రయాణిస్తూ దాదాపు 20 నెక్స్ట్ జనరేషన్ ‘స్టార్లింక్ వెర్షన్-3’ ఇంటర్నెట్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి విడుదల చేసింది.
అనంతరం ప్లాన్ చేసినట్లే గంటన్నర ప్రయాణం తర్వాత భూ వాతావరణంలోకి పునఃప్రవేశించి.. హిందూ మహాసముద్రంలో అత్యంత సురక్షితంగా నీటిపై పడి (సోఫ్ట్ స్ప్లాష్ డౌన్) తేలియాడింది. స్టార్షిప్ వ్యోమనౌక సముద్రంలో క్షేమంగా ల్యాండ్ కావడం ఇదే తొలిసారి కావడంతో “ఇది ఎంతో సంతోషకరమైన దృశ్యం” అని స్పేస్ఎక్స్ బృందం కొనియాడింది. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తంచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

