న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump).. ఇటీవల తన విమానాలను స్వాపింగ్ చేసినట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. ప్రాణ భయంతో ఆయన అకస్మాత్తుగా మరో విమానాన్ని ఎక్కినట్లు ఓ మీడియా కథనం ద్వారా వెల్లడైంది. గత నెలలో జరిగిన నాటో సమావేశాల కోసం ట్రంప్ టర్కీ వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో ఇరానియన్లు అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో ట్రంప్ బృందం అప్రమత్తమైంది. అంకారా నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లే సమయంలో.. ట్రంప్ సడెన్‌గా తన పాత ఎయిర్‌ఫోర్స్ వన్ విమానాన్ని వాడినట్లు తెలుస్తోంది.
ఖతార్ బహూకరించిన బోయింగ్ 747-8 విమానాన్ని వదిలేసి.. పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనే ఆయన తిరిగి న్యూయార్క్ వెళ్లినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. పాత విమానంలోనే రక్షణ సామర్థ్యం ఎక్కువ రేంజ్లో ఉన్నట్లు భావిస్తున్నారు. ఇరాన్‌పై దాడులు నేపథ్యంలో ఆ దేశం ప్రతీకారంతో రగులుతోంది. ట్రంప్‌ను హతమారుస్తామని ఆ దేశం హెచ్చరికలు కూడా చేసింది. అయితే టర్కీ ట్రిప్ సమయంలో .. ట్రంప్ భయపడినట్లు ఆ కథనంలో తెలిపారు. ఆ భయంతోనే ఆయన అకస్మాత్తుగా పాత విమానంలో స్వదేశం తిరిగి వెళ్లినట్లు రిపోర్టులో రాశారు.
ఇరానియన్లు దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇరాన్‌పై దాడిని ప్రోత్సహించేందుకు ట్రంప్‌ను రెచ్చగొట్టి ఉంటారని కొందరు అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ తనపై హత్యాయత్నం జరిగితే అప్పుడు వేల సంఖ్యలో ఇరాన్‌పై మిస్సైళ్లు ఫైర్ చేస్తానని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.