‘వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సంరక్షణ’
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పురుగు–తెగుళ్లను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ టి.భరత్ సూచించారు. పంటల దశకు అనుగుణంగా...
– రైతులు అప్రమత్తంగా ఉండాలి
– కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ సూచన
రుద్రంపూర్, సెప్టెంబర్ 23 : ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పురుగు–తెగుళ్లను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ టి.భరత్ సూచించారు. పంటల దశకు అనుగుణంగా నీటి యాజమాన్యం, పోషకాల వినియోగం, మందుల పిచికారి చేపట్టాలని తెలిపారు.
వరి : ప్రస్తుతం పంట పీలక దశలో ఉన్నందున పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కాండం కుళ్లు తెగులు కనిపిస్తే ప్రొపికోనజోల్ 1 మి.లీ. లేదా హెక్సాకోనజోల్ 2 మి.లీ. లేదా వాలిడామైసిన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కాండం తొలుచు పురుగు ఉధృతి ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు.
పత్తి : పూత, కాయలు ఏర్పడే దశలో ఉన్న పత్తిలో పురుగు ఉధృతిని గమనించాలి. మొక్కలకు పోషకాల లోపం ఉంటే 2 శాతం యూరియా లేదా 1 శాతం పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారి చేయాలి. పత్తిలో పచ్చ దోమ మరియు గమనించినట్లయితే నివారణకు రెండు మిల్లీ లీటర్ల పెప్రోనిల్ లేదా ప్లానికా మిడ్ 0. 3గ్రామ్స్ మందును 5 మిల్లీలీటర్ల 1500 పిపిఎం వేప నూనె పాటు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.గులాబీ రంగు పురుగు ఆశించినట్లయితే ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చాలి. గులాబీ రంగు పురుగు నివారణకు 2 మిల్లీ లీటర్ల ప్రొఫెనోఫోస్ మందును పిచికారి చేయాలి.
మొక్కజొన్న : పూత దశలో ఉన్న మొక్కజొన్నలో పోషకాల లోపం కనిపిస్తే 2 శాతం యూరియా లేదా 1 శాతం పొటాషియం నైట్రేట్ పిచికారి చేయాలి. కత్తెర పురుగు, ఇతర పురుగుల ఉధృతిని గమనిస్తూ సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
కంది, మినుము: కంది పంటలో ఎదుగుదల మందగిస్తే 2 శాతం యూరియా లేదా 1 శాతం పొటాషియం నైట్రేట్ పిచికారి చేయాలి. మినుములో కాండం ఈగ ఉధృతి ఉంటే ఎకరాకు 1 గ్రాము ఎసిఫేట్ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని తెలిపారు.
కూరగాయలు : మిరప, టమాటా, వంకాయ తదితర కూరగాయల్లో తెగుళ్లను గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి. అవసరాన్ని బట్టి మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా మెటలాక్సిల్ 2 గ్రాములు లేదా కార్బెండజిమ్+మాంకోజెబ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు.
పశుపోషణ : పశువులకు పరిశుభ్రమైన తాగునీరు, పచ్చిమేత అందించడంతో పాటు సకాలంలో టీకాలు వేయించాలి. గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకా వేయించాలని, నట్టల నివారణకు డీవార్మింగ్ చేయించాలని డాక్టర్ భరత్ సూచించారు. మందులను అవసరానికి మించి వినియోగించకుండా, సిఫారసు చేసిన మోతాదులోనే పిచికారి చేయాలని, పంటకు సంబంధించిన సమస్యపై సందేహం ఉంటే వ్యవసాయ శాఖ అధికారులు లేదా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

