Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మతిపరుపు, తడబాట్ల కారణంగా నిత్యం విమర్శల పాలవుతున్నారు. ఏదో ఒక పొరపాటు చేస్తూ మీడియాకు చిక్కుతున్నారు. తాజాగా అంతర్జాతీయ వేదికపై మరోసారి నోరు జారారు.
రష్యా తమపై రసాయనిక దాడులకు పాల్పడుతున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. పౌరులపై పాస్ఫరస్ బాంబులను ప్రయోగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.