Joe Biden | పొరపాటా..? గ్రహపాటా.. మరోసారి నోరు జారిన అమెరికా అధ్యక్షుడు బైడెన్..!
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మతిపరుపు, తడబాట్ల కారణంగా నిత్యం విమర్శల పాలవుతున్నారు. ఏదో ఒక పొరపాటు చేస్తూ మీడియాకు చిక్కుతున్నారు. తాజాగా అంతర్జాతీయ వేదికపై మరోసారి నోరు జారారు.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మతిపరుపు, తడబాట్ల కారణంగా నిత్యం విమర్శల పాలవుతున్నారు. ఏదో ఒక పొరపాటు చేస్తూ మీడియాకు చిక్కుతున్నారు. తాజాగా అంతర్జాతీయ వేదికపై మరోసారి నోరు జారారు.
లుథియానాలో జరిగిన నాటో సదస్సు (NATO Summit)లో పాల్గొన్న బైడెన్ మైకు ముందు టంగ్ స్లిప్ అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine President) వొలొదిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelenskyy) పేరును పలకబోయి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ (Vladimir) అని సంబోధించబోయారు. అయితే వెంటనే తన పొరపాటును గుర్తించిన అధ్యక్షుడు ఆ తర్వాత సరైన మాట పలికారు. అయితే, ఆ సమయంలో బైడెన్ పక్కనే జెలెన్ స్కీ కూడా ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు ‘వ్లాదిమిర్ (Vladimir), వొలొదిమిర్ (Volodymyr) వేర్వేరుగా కనిపించే దగ్గరి పదాలే కావడంతో బైడెన్ పొరపాటు పడి అలా పలికి ఉంటారు’ అంటూ సమర్థిస్తున్నారు. అదే సమయంలో కొందరు నెటిజన్లు బైడెన్ ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ‘బైడెన్ విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది’, ‘అతను పదవీ విమరణ చేయాల్సిన టైం వచ్చింది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, బైడెన్ ఇలా నోరు జారడం ఇదేమీ మొదటిసారి కాదు. కెమెరా సాక్షిగా ఎన్నో సార్లు తప్పిదాలు చేసి విమర్శల పాలయ్యారు. ఉక్రెయిన్ ప్రజలు అనబోయి.. ఇరాన్ ప్రజలు అని మాట్లాడారు. ‘పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై యుద్ధ ట్యాంకులతో చుట్టుముట్టొచ్చు. కానీ, అతను ఇరాన్ ప్రజల హృదయాలను గెలుచుకోలేరు’ అంటూ మాట్లాడి అందరి ముందూ నవ్వులపాలయ్యారు. ఆ తర్వాత ‘పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధంలో ఓడిపోయారు’ అనబోయి ‘పుతిన్ ఇరాక్ యుద్ధంలో ఒడిపోయారు’ అంటూ సంబోధించారు. అలా పలు సందర్భాల్లో తన మతిమరుపు కారణంగా టంగ్ స్లిప్ అయ్యి విమర్శల పాలయ్యారు.
https://twitter.com/Trendings911/status/1679381195073650688?s=20
Also Read..
Tomatoes | 2 వేల బాక్సులు.. రూ.38 లక్షలు.. కర్ణాటక రైతుకు వరంగా మారిన టమాటా ధరలు
Sadha | అందుకే పెళ్లి చేసుకోలేదు.. పెళ్లిపై సదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Samantha | ఈరోజు నా జీవితంలో ఎంతో ప్రత్యేకం.. సమంత పోస్ట్ వైరల్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

