Tomatoes | దేశంలో టమాటా (Tomato) మోత మోగుతోంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. ఏకంగా డబుల్ సెంచురీని దాటేసింది. పెరుగుతున్న టమాటా ధరలతో సామాన్యుల జోబులు చిల్లు పడుతుంటే.. కర్ణాటక (Karnataka) రాష్ట్రానికి చెందిన మధ్యతరగతి రైతు (farmer)కుటుంబానికి మాత్రం వరంగా మారింది.
కోలార్ ( Kolar ) ప్రాంతానికి చెందిన ప్రభాకర్ గుప్తాకు మొత్తం 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఎక్కువగా నిత్యావసర కూరగాయలు పండిస్తుంటారు. అందులో కొంత భాగంలో టమాటా కూడా పండించారు. ప్రస్తుతం ధరలు ఎక్కువగా ఉండటంతో 2,000 టమాటా బాక్సులను విక్రయించి ఏకంగా రూ.38 లక్షల ఆదాయం అర్జించాడు. ఒక్కో టమాటా బాక్సు రూ.1900 భారీ ధరకు విక్రయించాడు.
అయితే, 40 ఏళ్లుగా తన 40 ఎకరాల పొలంలో టమాటా సాగు చేస్తున్నానని రైతు ప్రభాకర్ గుప్తా చెప్పాడు. టమాటా ధరలు ఎన్నోసార్లు పెరిగినప్పటికీ, ఇంత మొత్తం మాత్రం మొదటిసారి వచ్చినట్లు తెలిపాడు. రెండేళ్ల క్రితం 15 కిలోల టమాటా కలిగిన ఓ బాక్సును రూ.800కు విక్రయించినట్లు చెప్పాడు. ఇప్పుడు ఏకంగా రూ.1,900 పలికిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టమాటా ధర రిటైల్ మార్కెట్లో కిలో రూ.126 కంటే ఎక్కువగా ఉంది.
Also Read..
Sadha | అందుకే పెళ్లి చేసుకోలేదు.. పెళ్లిపై సదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Samantha | ఈరోజు నా జీవితంలో ఎంతో ప్రత్యేకం.. సమంత పోస్ట్ వైరల్
Actor Vijay | సిగ్నల్ జంప్ చేసిన కారు.. దళపతి విజయ్ కు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు