Sadha | సదా.. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. ‘జయం’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో పాటు.. తమిళ్ లోనూ నటించింది. విక్రమ్ తో నటించిన ‘అపరిచితుడు’ (Aparichitudu) చిత్రం సదాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ చిత్రం తర్వాత సదా (Sadha) నటించిన చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో క్రమంగా ఇండస్ట్రీలో కనుమరుగైపోయింది.
ఇటీవలే సదా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. బుల్లితెర రియాలిటీ షోలు బీబీ జోడి, నీతోనే డాన్స్ కు సదా జడ్జిగా వ్యవహరిస్తోంది. కాగా, ప్రస్తుతం సదా వయసు 39 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. తన తోటి తారలు, స్నేహితులు పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. అయితే సదా మాత్రం సింగిల్ గా ఉండటంతో ఆమె ఎక్కడికెళ్లినా పెళ్లి (Marriage) గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సదా.. తాను ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించింది. పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ కోల్పోతామని తెలిపింది. ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువరోజులు నిలబడటం లేదని, అందుకే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది.
‘పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ కోల్పోతాం. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఇష్టమైన పని చేస్తున్నాను. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ఉంటాయో లేదో నాకు తెలియదు. మనల్ని అర్థం చేసుకునే వ్యక్తులు దొరికితే పర్వాలేదు. లేకపోతే..? ఈ కాలంలో చాలా మంది అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకుని కొద్దిరోజులకే విడిపోతున్నారు. ఇలా పెళ్లి చేసుకుని విడిపోవడం ఎందుకు..? దానికంటే పెళ్లి చేసుకోకపోవడమే మంచిది కద..!’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సదా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Ai Pics | షారుక్ టు కోహ్లీ.. పాక్ పర్యటనలో గ్లోబల్ స్టార్స్
Samantha | ఈరోజు నా జీవితంలో ఎంతో ప్రత్యేకం.. సమంత పోస్ట్ వైరల్
Actor Vijay | సిగ్నల్ జంప్ చేసిన కారు.. దళపతి విజయ్ కు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు