Ai Pics | అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అద్భుతాలు అన్నీఇన్నీ కావు. నేటి తరం టెక్ ప్రపంచంలో విపరీతంగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). ఏఐ టెక్నాలజీ మనకు సరికొత్త అవతరాలను పరిచయం చేస్తోంది. నిజం చెప్పాలంటే ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మార్చేస్తోంది. ఏఐ సాయంతో సృష్టించిన చిత్రాలు, వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. రకరకాల యాప్ ల ద్వారా తమ అభిమాన సెలబ్రిటీల ఫొటోలను తయారు చేసి ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తాజాగా ఏఐ కళాకారుడు సబూర్ అక్రమ్ సృష్టించిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.
మన ఇండియన్ సినీ, క్రికెట్ సెలబ్రిటీలు పాకిస్థాన్ (Pakistan) వెళ్లినట్లు ఫొటోలను రూపొందించాడు. పాక్ లోని పలు పర్యాటక ప్రాంతాల్లో ఫొటోలు దిగినట్లు క్రియేట్ చేశాడు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan), స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), నటి దీపికా పదుకొణె (Deepika Padukone), బాబర్ అజం (Babar Azam) సహా.. పలువురు హాలీవుడ్ తారలు సైతం పాక్ పర్యటనలో ఉన్నట్లు సృష్టించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read..
Samantha | ఈరోజు నా జీవితంలో ఎంతో ప్రత్యేకం.. సమంత పోస్ట్ వైరల్
Actor Vijay | సిగ్నల్ జంప్ చేసిన కారు.. దళపతి విజయ్ కు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు
Loan app | లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య