Loan app | లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Loan app | లోన్ యాప్ (Loan app) కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెంగళూరు (Bengaluru)లో చోటు చేసుకుంది.
Loan app | లోన్ యాప్ (Loan app) కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెంగళూరు (Bengaluru)లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇంజినీరింగ్ విద్యార్థి (engineering student ) తేజష్ (22) (Tejash) లోన్ యాప్ ద్వారా రూ.46,000 రుణం తీసుకున్నాడు. తిరిగి చెల్లించే విషయంలో విఫలం కావడంతో యాప్ అధికారులు వేధింపులకు దిగారు. దీంతో వారి వేధింపులు తాలలేక తేజష్ తన జీవితానికి ముగింపు పలికాడు. మంగళవారం సాయంత్రం జాలహళ్లిలోని హెచ్ఎంటీ లే అవుట్ లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి గోపీనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తేజష్ ఏడాదిన్నరగా ఈ లోన్ యాప్ లను వినియోగిస్తున్నట్లు అతడి తండ్రి గోపీనాథ్ తెలిపారు. 20 రోజుల క్రితమే తనకు ఈ విషయం తెలిసిందని.. దీంతో ఈఎంఐ చెల్లించేందుకు కొంత డబ్బు సాయం చేసినట్లు చెప్పాడు. మంగళవారం కళాశాల లేకపోవడంతో ఇంట్లోనే ఉన్నాడని గోపీనాథ్ పేర్కొన్నాడు. తన కూతుర్ని ట్యూషన్ వద్ద దింపి వచ్చే సరికి జరగరాని ఘోరం జరిగిపోయిందని వాపోయాడు. విగతజీవిగా ఉన్న కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే తేజష్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోపీనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
తాజా ఘటనతో పోలీసులు నగరంలో పెరుగుతున్న లోన్ యాప్ మోసాల (Loan app scam) పై ప్రత్యేక దృష్టి పెట్టారు. సులభంగా లభించే రుణాల కోసం ప్రజలు ఆశపడి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. అనధికారిక యాప్ లను డౌన్ లోడ్ చేయడం, తెలియని లింక్ లను యాక్సెస్ చేయడం వంటివి చేయొద్దని సూచిస్తున్నారు.
Also Read..
Samantha | ఈరోజు నా జీవితంలో ఎంతో ప్రత్యేకం.. సమంత పోస్ట్ వైరల్
Actor Vijay | సిగ్నల్ జంప్ చేసిన కారు.. దళపతి విజయ్ కు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు
Delhi Rains | యమునా నది మహోగ్రరూపం.. కేజ్రీవాల్ ఇంటి సమీపంలోకి చేరిన వరద
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

