Isfahan | ఇస్ఫహాన్‌లోని ఇరాన్ అణుకేంద్రంపై వైమానిక దాడులు
Isfahan | ఇరాన్ దేశానికి చెందిన అత్యంత కీలకమైన అణుకేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు వైమానిక దాడులకు పాల్పడ్డాయి. అణుకేంద్రం ఉన్న ఇస్ఫహాన్ నగరంపై అమెరికా-ఇజ్రాయెల్ విమానాలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇస్ఫహాన్‌లోని వివిధ ప్రదేశాల్లో భారీ పేలుళ్లు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Isfahan : ఇరాన్ దేశానికి చెందిన అత్యంత కీలకమైన అణుకేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు వైమానిక దాడులకు పాల్పడ్డాయి. అణుకేంద్రం ఉన్న ఇస్ఫహాన్ నగరంపై అమెరికా-ఇజ్రాయెల్ విమానాలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇస్ఫహాన్‌లోని వివిధ ప్రదేశాల్లో భారీ పేలుళ్లు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలాచోట్ల భారీ ఎత్తున నల్లపొగ ఆకాశాన్ని కమ్మేసింది. అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
అదేవిధంగా పశ్చిమ టెహ్రాన్‌లోని ఇరాన్ స్పేస్ రిసెర్చ్ సెంటర్‌పై కూడా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. ఇరాన్ తనకు అవసరమైన శాటిలైట్ ఇంటెలిజెన్స్ మ్యాపింగ్ సమాచారాన్ని అక్కడి నుంచే సేకరిస్తుంది. ఇదిలావుంటే ఇరాన్‌పై దాడులకు అమెరికా తన వద్ద ఉన్న బి-52 బాంబర్ విమానాన్ని పంపినట్లు తెలుస్తోంది. ఇది దాదాపు 38 టన్నుల బాంబులను తీసుకెళ్లగలదు. దీనికి సంబంధించిన వీడియోను సెంట్రల్ కమాండ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఆదివారం ఉదయం దాదాపు 20 నిమిషాల వ్యవధిలోనే 20 భారీ పేలుళ్లు వినిపించినట్లు స్థానికులు వెల్లడించారు. ముఖ్యంగా నగరంలోని ఎయిర్‌పోర్టు వద్ద ఇవి చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Central Iran
- iran
- Isfahan
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

