జైపూర్: ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. విండోలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలను అడ్డుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎస్యూవీ వాహనాలు, బైకులతో సహా 140కుపైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. (Police Seize Over 140 Vehicles) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. కిడ్నాప్, దోపిడీ, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు పెరుగడంపై జైపూర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేరాలకు వినియోగించే డార్క్ విండో ఫిల్మ్‌లు, మోడిఫైడ్ బైక్‌లపై ప్రత్యేక దృష్టిసారించారు.
కాగా, జైపూర్ డీసీపీ రాజశ్రీ వర్మ, అదనపు డీసీపీ లలిత్ శర్మ పర్యవేక్షణలో గత మూడు రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వంద ఎస్యూవీ వాహనాలు, 41 మోడిఫైడ్ బైకులతో సహా 141 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాల సీజ్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
जयपुर में सड़क पर नियम तोड़ने वालों की खैर नहीं अब।
जयपुर में ..–
33 काली थार
23 काली स्कॉर्पियो
44 अन्य काले शीशे वाली कारें
26 पावर बाइक
15 मोडिफाई साइलेंसर वाली बाइक्स जब्त। pic.twitter.com/5ffQTp80A5— Manish Bhattacharya (INDIA TV)﮷ (@Manish_IndiaTV) December 2, 2025
Also Read:
Poisonous gas leak | విషపూరిత వాయువు లీక్.. ఇద్దరు మహిళలు మృతి, పలువురికి అస్వస్థత
Man Slits Daughter’s Throat | భార్యపై అనుమానంతో.. నిద్రిస్తున్న కుమార్తె గొంతు కోసిన వ్యక్తి
Watch: వృద్ధురాలి చెంపపై కొట్టిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్