లక్నో: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రాత్రి వేళ వేరే ప్రాంతంలో పోలీసులు పడేశారు. ఉదయం షాపు ముందున్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేసిన పోలీసులు తమ సిబ్బందే ఈ పనికి పాల్పడినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. (Police Dump Unidentified Body) ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో శాస్త్రి నగర్ ఎల్ బ్లాక్ క్రాసింగ్ ప్రాంతానికి పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డు బైక్‌పై చేరుకున్నారు. ఎలక్ట్రిక్ ఆటోలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని అక్కడకు తెచ్చారు. ఒక షాపు ముందు ఆ మృతదేహాన్ని వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, శుక్రవారం ఉదయం షాపు ముందున్న మృతదేహాన్ని చూసి స్థానికులు షాక్ అయ్యారు. లోహియా నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. దీంతో కానిస్టేబుల్ రాజేష్, హోమ్ గార్డ్ రోహ్తాస్ కలిసి వ్యక్తి మృతదేహాన్ని ఆటోలో తెచ్చి అక్కడ పడేసినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు.
వారిద్దరితోపాటు ఎల్ బ్లాక్ అవుట్‌పోస్ట్ ఇన్చార్జ్ అయిన ఎస్ఐ జితేంద్రను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తును ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్‌కు అప్పగించారు. కాగా, సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
From Meerut, UP
Policemen spotted a body by the road. They called in a e-rickshaw and ferried the body to an area falling under jurisdiction of a neighbouring police station. All this to save hemselves from the hassle of probe and paperwork. Also, dead bodies don’t pay bribe. pic.twitter.com/dN7tp6EcfW
— Piyush Rai (@Benarasiyaa) December 6, 2025
Also Read:
Watch: వృద్ధురాలి చెంపపై కొట్టిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Watch: స్కూల్‌కు వెళ్లకుండా ఉండేందుకు.. బాలుడు ఏం చేశాడంటే?