Suryakumar Yadav : టీ20 సంచలనంగా భారత జట్టులో పాతుకుపోయిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సారథిగానూ హిట్టయ్యాడు. పొట్టి క్రికెట్లో భారత్‌ను తిరుగులేని శక్తిగా మార్చిన సూర్య.. సొంతగడ్డపై భారత్‌కు పొట్టి ప్రపంచకప్ అందించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ గెలిచిన తర్వాత మైదానంలో భారత ఆటగాళ్లు కొందరు తమ ప్రియురాళ్లతో సంబురాలు చేసుకోవడంపై దుమారం రేగుతున్న వేళ.. ఈ విజయంలో అభిమానులకూ భాగముందని చెబుతున్నాడు సూర్య.
నరేంద్ర మోడీ స్టేడియంలో మార్చి 8న న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత జట్టు వరుసగా రెండోసారి పొట్టి కప్‌ను ఒడిసిపట్టింది. మరే ఆతిథ్య జట్టుకు సాధ్యమవ్వని విధంగా.. సొంతగడ్డపై పొట్టి వరల్డ్‌కప్‌ను పట్టేసింది. సారథిగా దేశానికి వరల్డ్‌కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ దిగ్గజాల సరసన చేరాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ట్రోఫీని నిలబెట్టుకున్న మొదటి జట్టుగా టీమిండియా గుర్తింపు సాధించడంలో కీలకమైన ఈ మిస్టర్ 360 ప్లేయర్.. వరల్డ్‌కప్ విజయం అందరిదీ అంటున్నాడు.
Not just a team. A family.
Not just a trophy. A dream for a billion of us.PROUD to lead this group, PROUD to represent my India 🇮🇳🏆 A huge thank you to everyone standing beside me. You are the pillars of my strength 💙🙌🏼🫶🏻 pic.twitter.com/1fZ1DH3o5M
— Surya Kumar Yadav (@surya_14kumar) March 8, 2026
‘ప్రియమైన భారత జట్టు అభిమానులరా.. మొదటగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ మద్దతు, ఆశీర్వాదం వల్లనే మేము ఇక్కడ ఉన్నాం. ఈ వరల్డ్‌కప్ ట్రోఫీ యావత్ దేశానికి చెందుతుంది. మేము గెలిచినా.. ఇది మా ఒక్కరి విజయమే కాదు. వరల్డ్‌కప్ గెలవాలనేది మనదేశంలో బ్యాట్ పట్టుకున్న ప్రతి చిన్నారి కల. స్టేడియానికి భారీగా తరలివచ్చే అభిమానులకు ఈ ట్రోఫీ చెందుతుంది.
Surya kept his team united, maintained a positive environment, backed the players and had faith in his 11. Today God has given him everything he wanted. The entire country is happy. pic.twitter.com/3TWspbgNUv
— Cricket Hindustan (@goldensports98) March 8, 2026
ఇంటివద్ద నుంచి మాకు మద్దతు తెలిపిన లక్షలాదిమందికి ఈ ట్రోఫీ విజయంలో భాగముంది. మీ ప్రార్ధనలు, అంతులేని ప్రేమ మాకు వరల్డ్‌కప్ ట్రోఫీని గెలిచేందుకు అవసరమైన బలాన్నిచ్చాయి. భారత్‌లో క్రికెట్ కేవలం ఆటే కాదు. అది ఒక భావోద్వేగం. అందుకే.. ఈ విజయం మీ అందరిది’ అని సూర్యకుమార్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టాడు.