TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.
తిరుమల : టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ( Empowered Committee) గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ( Muddada Ravichandra) శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల ( Tirumala )శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన కార్యక్రమంలో అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఛైర్మన్‌కు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ, దేవుని సేవ చేసేందుకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా, మెరుగైన రీతిలో కొనసాగించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ మనసును పూర్తిగా స్వామివారిపై లగ్నం చేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను టీటీడీ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. భక్తులకు అన్ని విధాలా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ నిర్వహిస్తున్న ఇతర 64 ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఈవో ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్ పాల్గొన్నారు. అక్టోబర్ 31న టీటీడీ పాలక మండలి పదవికాలం ముగియడంతో దాని స్థానంలో ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో అథారిటీ కమిటీని ఏర్పాటు చేసింది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. ‘మాజీ భార్య’ ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

