Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ‘రామాయణం’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కించిన ఈ భారీ పౌరాణిక చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలోని విజువల్స్, నటీనటుల అభినయం, భారీ నిర్మాణ విలువలపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ‘రామాయణం’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కించిన ఈ భారీ పౌరాణిక చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలోని విజువల్స్, నటీనటుల అభినయం, భారీ నిర్మాణ విలువలపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, అట్లీ వంటి పలువురు ఈ చిత్రాన్ని మెచ్చుకోగా.. తాజాగా మహేష్ బాబు కూడా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘రామాయణ’ పార్ట్-1 సినిమా చూసిన మహేష్ బాబు.. చిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన పురాణ గాథను ఇంత అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవిల నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఇంత భారీ స్థాయిలో సినిమాను నిర్మించడానికి కృషి చేసిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ‘రామాయణ’ చిత్ర బృందం మొత్తం అభినందనలకు అర్హులని మహేష్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం ‘వారణాసి’ గురించి కూడా చర్చకు దారితీసింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ భారీ చిత్రం సోషియో ఫాంటసీ, టైమ్ ట్రావెల్, మైథలాజికల్ అంశాల కలయికతో రూపొందుతోంది. ఇందులో రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్ అత్యంత కీలకంగా ఉండనుంది.
ఈ చిత్రంలో మహేష్ బాబు తొలిసారిగా శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగే రామాయణ ఘట్టం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ప్రచారం జరుగుతోంది. రాముడి పాత్ర కోసం మహేష్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. మహేష్ బాబును శ్రీరాముడి పాత్రలో చూపించేందుకు రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. లుక్ టెస్ట్ సమయంలో మహేష్‌ను రాముడి గెటప్‌లో చూసి తాను ఆశ్చర్యపోయానని గతంలో రాజమౌళి వెల్లడించారు. దీంతో ‘వారణాసి’లో మహేష్ రాముడి అవతారంలో ఎలా కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.ఇక ‘రామాయణం’ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, మహేష్ బాబు రాముడి పాత్రలో ఎలా మెప్పిస్తారనే చర్చ మొదలైంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే పౌరాణిక పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఈ రెండు చిత్రాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

