US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
Global Stocks: అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు గ్లోబల్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. స్టాక్‌మార్కెట్లలో ట్రిలియన్ల డాలర్లు ఆవిరైపోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ మందగిస్తుందన్న భయాందోళనల వల్ల అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సుమారు 2.5 ట్రిలియన్ల డాలర్ల మార్కెట్ మాయమైంది.
న్యూయార్క్: అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు జయకేతనం ఎగురవేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశ స్టాక్‌మార్కెట్ల(US Stocks)లో ట్రిలియన్ల డాలర్లు ఆవిరైపోతున్నాయి. అమెరికా, యూరోప్, ఆసియా దేశాల్లోని టెకీ సంస్థలపై మిడ్‌టర్మ్ ఫలితాలు దారుణమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ మందగిస్తుందన్న భయాందోళనల వల్ల అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికాలో నాస్డాక్ షేర్లు 5.5 శాతం పడిపోయాయి. దీంతో సుమారు 2.5 ట్రిలియన్ల డాలర్ల మార్కెట్ నష్టపోయినట్లు తెలుస్తోంది. నాస్‌డాక్‌తో పాటు ఇతర అమెరికా స్టాక్ ఇండెక్స్‌ల్లోనూ భారీ పతనం నమోదు అయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆంక్షలు కఠినం చేసే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటును డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఏఐపై పెట్టుబడి పెట్టేందుకు వెనుకడుగు వేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెకీ కంపెనీల షేర్లు షేక్ అయ్యాయి. ఏఐపై భారీగా పెట్టుబడి పెడితే, దానికి తగిన లాభాలు వస్తాయా రావా అన్న ఆలోచనల్లో మదుపరులు ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో మ్యాగ్నిఫిషియంట్ సెవన్ టెకీ కంపెనీల్లో భాగమైన యాపిల్, ఎన్వీడియా, టెస్లా కంపెనీలు ట్రేడింగ్‌లో ట్రిలియన్ డాలర్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎన్విడియా కంపెనీ షేర్లు 9 శాతం పడిపోయాయి. ఇతర చిప్ తయారీ కంపెనీలు కూడా ఇబ్బందిపడ్డాయి. ఏఎండీ, మైక్రాన్ కంపెనీల షేర్లు దాదాపు 17 శాతం కుప్పకూలాయి. బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీల్లో షేర్లు 8, 11 శాతం పడిపోయినట్లు గుర్తించారు. దీంతో ఆ రెండు కంపెనీలకు చెందిన సుమారు 300 బిలియన్ల డాలర్ల మార్కెట్ వాల్యూ పడిపోయింది. రిపబ్లికన్ పార్టీ ప్రచారం కోసం మస్క్ సుమారు 450 మిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు. దీంట్లో టెక్సాస్ సేనేట్ అభ్యర్థి కెన్ పాక్స్టన్ కోసం 45 మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టారు. కానీ అక్కడ డెమోక్రటిక్ అభ్యర్థి గెలుపొందారు.
యురోప్కు చెందిన టెకీ కంపెనీ, చిప్‌మేకర్ ఇన్ఫినియాన్ షేర్లు కూడా 8.5 శాతం పడిపోయాయి. ఇక టెకీ ఎక్విప్మెంట్ తయారీ సంస్థ ఏఎస్ఎంఎల్ కంపెనీ షేర్లు 6.5 శాతం తగ్గాయి. శుక్రవారం ఏషియన్ మార్కెట్లు కూడా వణికిపోయాయి. జపాన్‌లో నిక్కీ షేర్ ఇండెక్స్ 6 శాతం పడిపోయింది. మెమోరీ చిప్ తయారీ సంస్థలు కియాక్సియా, టోక్యో ఎలక్ట్రాన్ కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దక్షిణ కొరియాలో చిప్‌మేకర్ ఎస్కే హైనిక్స్ 10 శాతం, శాంసంగ్ 6.4 శాతం షేర్లు డౌనయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చులపై భయాందోళనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుదేలు అయినట్లు మార్కెట్‌వాచ్ నిపుణుడు బ్రిట్నీ నుయెన్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

