Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
Athulya Chandra | కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన డాక్టర్ హనీట్రాప్ దోపిడీ కేసుకు సంబంధించి, ప్రముఖ నటి మత్తు వదలరా ఫేమ్ అతుల్య చంద్ర, నటుడు, నిర్మాత బిబిన్ పెరుంబిల్లిలను పోలీసులు అరెస్టు చేశారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన డాక్టర్ హనీట్రాప్ దోపిడీ కేసుకు సంబంధించి, ప్రముఖ నటి ‘మత్తు వదలరా’ ఫేమ్ అతుల్య చంద్ర, నటుడు, నిర్మాత బిబిన్ పెరుంబిల్లిలను పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో ఓ యువ డాక్టర్‌ను ఫ్లాట్‌కు రప్పించి, ఆయనపై భౌతిక దాడికి పాల్పడి రూ.3.5 లక్షల విలువైన గాడ్జెట్లు, వస్తువులను దోచుకున్న ఘటనలో ఈ అరెస్టులు జరిగాయి. కొచ్చిలోని ‘ఎసెన్ స్ప్రింగ్‌డేల్’ అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్‌కు అత్యవసరంగా వైద్య సహాయం కావాలని చెప్పి సోమవారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు ఆ డాక్టర్‌ను రప్పించారు. అయితే, ఆ వైద్యుడు అక్కడకు చేరుకునేసరికి ఆ ఫ్లాట్‌లో దాదాపు 12 మంది వ్యక్తులు ఉన్నారు.
డాక్టర్ రాగానే, తమ బంధువుపై ఆయన అత్యాచారం చేశారంటూ నిందితులు నిరాధార ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగారు. నటుడు బిబిన్ పెరుంబిల్లితో పాటు మరికొందరు ఆ వైద్యుడిని కుర్చీలో కూర్చోబెట్టి చెంపదెబ్బ కొట్టి, పక్కఎముకలపై తీవ్రంగా దాడి చేశారు. అదే సమయంలో నటి అతుల్య చంద్ర ఆ డాక్టర్ మొబైల్ ఫోన్, స్మార్ట్‌వాచ్, వైర్లెస్ ఇయర్‌ఫోన్స్‌ను బలవంతంగా లాక్కున్నారు. అంతేకాకుండా, నువ్వు దొంగవి, నిన్ను చంపేస్తాను అంటూ ఆమె తీవ్ర పదజాలంతో బెదిరించినట్లు ఎఫ్ఐఆర్లో స్పష్టంగా నమోదైంది. మిగతా నిందితులు ఆ డాక్టర్‌ను ఒక గదిలో బంధించి దారుణంగా కొట్టారు. ఆ దాడి నుంచి ప్రాణాలతో ఎలాగోలా తప్పించుకున్న ఆ వైద్యుడు నేరుగా కడవంత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇది కేవలం దోపిడీ కోసమే జరిగిందా లేక దీని వెనుక ఏదైనా హనీట్రాప్ (Honey-trap) కోణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

