న్యూఢిల్లీ: ఒక పెళ్లి వేడుకలో ఊహించని సంఘటన జరిగింది. సాంప్రదాయ ఏడు ప్రమాణాలకు వరుడు మరో ప్రమాణాన్ని జోడించాడు. అతడి 8వ హామీ విని వధువుతో సహా అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. (8th Vachan by Groom) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మయాంక్, దియా జంటకు పెళ్లి జరిగింది. సాంప్రదాయమైన ఏడు ప్రమాణాలను వరుడు మయాంక్ వల్లించాడు. ఆ తర్వాత మైక్ తీసుకున్నాడు. మరో వాగ్దానానికి వధువు అంగీకరించాలని కోరాడు. ‘ఈ రోజు నుంచి మన గదిలో ఏసీ ఉష్ణోగ్రతను నేనే నియంత్రిస్తా’ అని అన్నాడు. దీంతో వధువు దియాతో పాటు పెళ్లి అతిథులు నవ్వుకున్నారు.
కాగా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. చాలా పెద్ద వాగ్దానమని ఒకరు, ఏసీ ఎంత ఉండాలో అన్నది ఆ తర్వాత భార్య నిర్ణయిస్తుందని మరొకరు వ్యాఖ్యానించారు.
Also Read:
case for false details in SIR | ‘సర్’లో తప్పుడు సమాచారం.. దేశంలోనే తొలిసారి కేసు నమోదు
Watch: షాపు యజమానిని గన్తో బెదిరించిన పోలీస్.. గోల్డ్ చైన్ ఇవ్వాలని డిమాండ్
Watch: మృతదేహాన్ని వేరే ప్రాంతంలో పడేసిన పోలీసులు.. తర్వాత ఏం జరిగిందంటే?