లక్నో: ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో ఒక కుటుంబం తప్పుడు సమాచారం ఇచ్చింది. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద సూపర్వైజర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారి ఆ కుటుంబంపై కేసు నమోదు చేశారు. (case for false details in SIR) ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నూర్జహాన్ కుటుంబం రాంపూర్‌లో నివసిస్తున్నది. ఆమె ఇద్దరు కుమారులైన అమీర్ ఖాన్, డానిష్ ఖాన్ చాలా కాలంగా దుబాయ్, కువైట్‌లో ఉంటున్నారు.
కాగా, ఓటర్ల జాబితా అప్డేట్ కోసం చేపట్టిన ‘సర్’ ఫారమ్‌లో నూర్జహాన్ తప్పుడు సమాచారం ఇచ్చింది. తన కుమారులు రాంపూర్‌లో నివసిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఫొర్జరీ సంతకాలు ఉన్న పత్రాలను బూత్ స్థాయి అధికారికి సమర్పించింది.
మరోవైపు ‘సర్’ వివరాలు డిజిటలైజేషన్ సమయంలో నూర్జహాన్ ఇచ్చిన సమాచారం తప్పుగా గుర్తించారు. ఆమె కుమారుల సంతకాలు ఫొర్జరీ అని గ్రహించారు. దీంతో బీఎన్‌ఎస్‌తోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద సూపర్వైజర్ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో నూర్జహాన్ కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ‘సర్’ ప్రక్రియలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కేసు నమోదు కావడం దేశంలోనే ఇది తొలిసారి.
Also Read:
Cop Burnt Alive | డివైడర్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్న కారు.. సజీవ దహనమైన పోలీస్ అధికారి
Watch: మృతదేహాన్ని వేరే ప్రాంతంలో పడేసిన పోలీసులు.. తర్వాత ఏం జరిగిందంటే?