అహ్మదాబాద్: ఖరీదైన మొబైల్ ఫోన్ కొనుగోలుకు తండ్రి నిరాకరించాడు. దీంతో కుమారుడు మనస్తాపం చెందాడు. బోరుబావిలోకి దూకాడు. రెస్క్యూ బృందాలు వెలికితీయగా అప్పటికే అతడు మరణించాడు. (Youth jump into borewell) జార్ఖండ్‌కు చెందిన 20 ఏళ్ల రుస్తం షేక్ కుటుంబం గుజరాత్లో నివసిస్తున్నది. భుజ్ జిల్లాలోని ఆశాపుర కొండ సమీపంలో అతడు కూలీగా పని చేస్తున్నాడు.
కాగా, డిసెంబర్ 5న ఖరీదైన మొబైల్ ఫోన్ వాయిదాల పద్ధతిలో కొంటానని తన తండ్రికి రుస్తం తెలిపాడు. అయితే దీనికి తండ్రి ఒప్పుకోలేదు. దీంతో ఆ యువకుడు మనస్తాపం చెందాడు. శుక్రవారం సాయంత్రం కూలీ పని చేసే చోట ఉన్న బోరుబావిలోకి దూకాడు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ బృందాలు కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బోరుబావిలోకి దూకిన రుస్తం షేక్‌ను కాపాడేందుకు సుమారు 9 గంటలపాటు శ్రమించారు. పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేశారు. కెమెరా ద్వారా అతడు చిక్కుకున్న లోతును గుర్తించారు.
చివరకు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హుక్ ద్వారా బోరుబావి నుంచి రుస్తంను బయటకు తీశారు. వెంటనే అంబులెన్స్‌లో భుజ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
કચ્છના કુકમા ગામમાં મોંઘા મોબાઈલની જીદે ચડેલા 20 વર્ષના એક યુવાને બોરવેલમાં કૂદીને જીવ ટૂંકાવ્યો…!#KutchNews #Borwell #Accident #YouthTragedy #FamilyDispute #ThinkBeforeAct #SocialAwareness #TragicIncident #GujaratiNews #Kutch #Gujarat #India #News #Jamawat #JamawatUpdate pic.twitter.com/m6ULBjQSDB
— Jamawat (@Jamawat3) December 7, 2025
Also Read:
Navjot Kaur | రూ.500 కోట్లు ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడు: నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య
Bride asks for bulb on wedding night | తొలిరాత్రి వేళ బల్బు అడిగిన వధువు.. కంగారుపడి మాయమైన వరుడు
8th Vachan by Groom | పెళ్లిలో 8వ హామీ ఇచ్చిన వరుడు.. అది విని నవ్వుకున్న వధువు