హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏడాదికి సగటున 3,200 మంది మహిళలు సర్వైకల్(గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ బారిన పడుతున్నారని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు. శనివారం కింగ్ కోఠి దవాఖానలో హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఈ క్యాన్సర్ 99.7% మందికి హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ కారణంగా వస్తుందని చెప్పారు. ఈ వైరస్ అంతానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 14 ఏండ్లు నిండి 15 ఏండ్ల లోపు బాలికలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడించారు.