లక్నో: ఒక జంటకు పెళ్లి జరిగింది. అయితే తొలి రాత్రి వేళ గదిలో ఎక్కువ కాంతి ఉండటంతో తక్కువ కాంతి ఉన్న బల్బు కోసం వధువు అడిగింది. కంగారుపడిన వరుడు బయటకు వెళ్లి మాయమయ్యాడు. (Bride asks for bulb on wedding night) ఐదు రోజుల తర్వాత మరో నగరంలో అతడు ఉన్నట్లు గుర్తించి తీసుకువచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. వారం రోజుల కిందట ముజఫర్‌నగర్‌లో ఒక మహిళతో మొహ్సిన్కు పెళ్లి జరిగింది. శోభనం రోజు రాత్రి వధువు గదిలో వేచి ఉన్నది. ఆ గదిలో కాంతి ఎక్కువగా ఉన్నది. దీంతో గదిలోకి వచ్చిన మొహ్సిన్ను తక్కువ కాంతి ఉన్న బల్బు కావాలని వధువు అడిగింది.
కాగా, బల్పు కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మొహ్సిన్ ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గంగా నది వైపు అతడు వెళ్లినట్లు సీసీటీవీలో కనిపించింది. దీంతో మొహ్సిన్ నదిలోకి దూకి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా గజ ఈతగాళ్లతో ఆ నదిలో వెతికించారు.
మరోవైపు మొహ్సిన్ జాడ తెలియకపోవడంతో అతడు లేకుండానే మరునాడు ఇద్దరు సోదరిల పెళ్లి నిరూత్సాహంగా జరిగింది. ఐదు రోజుల తర్వాత డిసెంబర్ 1న తన బంధువుకు అతడు ఫొన్ చేశాడు. హరిద్వార్‌లో తాను ఉన్నట్లు చెప్పాడు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ బృందం అక్కడకు వెళ్లింది. హరిద్వార్‌లో ఉన్న మొహ్సిన్ను సురక్షితంగా ఉత్తరప్రదేశ్‌కు తీసుకొచ్చారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన నుంచి బయటపడ్డారు.
అయితే శోభనం రోజు రాత్రి ఇంటి నుంచి ఎందుకు వెళ్లావని పోలీసులు ప్రశ్నించగా మొహ్సిన్ షాకింగ్ సమాధానం చెప్పాడు. వధువు ముందు తాను కంగారుపడినట్లు తెలిపాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావడంతో ఇంటి నుంచి వెళ్లినట్లు చెప్పాడు. హరిద్వార్ చేరుకునే వరకు కదులుతూనే ఉన్నట్లు వెల్లడించాడు.
Also Read:
8th Vachan by Groom | పెళ్లిలో 8వ హామీ ఇచ్చిన వరుడు.. అది విని నవ్వుకున్న వధువు
Navjot Kaur | రూ.500 కోట్లు ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడు: నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య
Watch: మృతదేహాన్ని వేరే ప్రాంతంలో పడేసిన పోలీసులు.. తర్వాత ఏం జరిగిందంటే?