హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ పనులు పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. ప్రణాళికలను అనుసరించి 24 గంటలు, మూడు షిఫ్టుల్లో పనులు చేపడుతున్నట్టు తెలిపారు.
శనివారం ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనుల పురోగతిపై సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. సొరంగమార్గం-1, సొరంగ మార్గం-2లో తవ్వకాలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. శ్రీశైలం నుంచి ఇన్లెట్ సొరంగమార్గం పనులు ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నట్టు చెప్పారు.