జైపూర్: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వంగుతున్నది. దీంతో పగుళ్లు ఏర్పడ్డాయి. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్మాణం పూర్తవుతున్న దశలో ఉన్న ఆ బిల్డింగ్‌ను కూల్చివేశారు. (building razed) రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. మాల్వియా నగర్లో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు.
కాగా, మెట్ల కోసం గొయ్యి తవ్వుతుండగా ఒక పిల్లర్ కదిలింది. దీంతో ఆ బిల్డింగ్ కాస్త వంగడంతోపాటు పగుళ్లిచ్చింది. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఆ బిల్డింగ్ పరిస్థితిని పరిశీలించారు. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించినట్లు జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ (జేడీఏ) ఆరోపించింది. దీంతో ప్రమాదకరంగా ఉన్న ఆ బిల్డింగ్‌ను కూల్చివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆదివారం అధికారులు సురక్షిత పద్ధతిలో దానిని కూల్చివేశారు.
మరోవైపు తమకు అన్ని అనుమతులు ఉన్నాయని భవన యజమాని తెలిపాడు. అయినప్పటికీ అధికారులు బిల్డింగ్‌ను కూల్చివేసినట్లు విమర్శించాడు. కూల్చివేతకు ముందు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, సాంకేతిక విశ్లేషణ జరుగలేదని ఆరోపించాడు.
जयपुर के मालवीय नगर इलाके में जेडीए ने गिराई बिल्डिंग pic.twitter.com/sWDrYf2eg5
— Rishi raj joshi (@rishirajjoshi88) December 7, 2025
Also Read:
IndiGo chaos | 6 రోజుల గందరగోళం తర్వాత.. ప్రయాణికులకు రూ.610 కోట్లు తిరిగిచ్చిన ఇండిగో
Watch: హైవేపై ఏనుగుల గుంపు హల్చల్.. వీడియో వైరల్