చండీగఢ్: కుమార్తె గురించి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న తండ్రి కూతురి చేతులు కట్టి కాలువలోకి తోశాడు. దీనిని వీడియో తీశాడు. ఆమె మరణించినట్లు భావించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Girl Thrown Into Canal By Father) రెండు నెలల తర్వాత ఆ బాలిక తిరిగి వచ్చింది. తండ్రిని జైలు నుంచి విడిచిపెట్టాలని పోలీస్ అధికారులను ప్రాథేయపడింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల బాలిక చదువు మానేసి ఖాళీగా తిరుగుతున్నది. దీంతో కుమార్తె క్యారెక్టర్‌పై తండ్రి సుర్జిత్ సింగ్ అనుమానం వ్యక్తం చేశాడు.
కాగా, సెప్టెంబర్ 29న రాత్రి వేళ కూతురు విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న సుర్జిత్ సింగ్ పెద్ద కుమార్తె చేతులను తాడుతో కట్టేశాడు. భార్య, మరో ముగ్గురు కుమార్తెలు చూస్తుండగా ఆమెను కాలువలోకి తోశాడు. షాక్ అయిన తల్లి సహాయం కోసం కేకలు వేసింది. అయితే నీటిలో కొట్టుకుపోతున్న కుమార్తెకు తండ్రి బై బై చెప్పాడు. అతడు రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు నీటిలో కొట్టుకుపోయిన ఆ బాలిక మరణించినట్లు ఆమె కుటుంబం, పోలీసులు భావించారు. బంధువుల ఫిర్యాదుపై హత్య కేసు నమోదు చేశారు. సుర్జిత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.
అయితే రెండు నెలల తర్వాత డిసెంబర్ 7న ఆ బాలిక తిరిగి వచ్చింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో ఎలా బయటపడిందో అన్నది మీడియాకు వివరించింది. అనారోగ్యం పాలైన తాను ఒకచోట చికిత్స పొందినట్లు తెలిపింది. తలకు గాయం వల్ల కొన్ని విషయాలు గుర్తు లేకపోవడంతో వెంటనే తిరిగి రాలేకపోయినట్లు చెప్పింది. అయితే ఈ రెండు నెలలు ఎక్కడ ఉన్నదో ఆమె వెల్లడించలేదు.
కాగా, అరెస్ట్ చేసిన తన తండ్రి సుర్జిత్ సింగ్‌ను జైలు నుంచి విడుదల చేయాలని పోలీస్ అధికారులను ఆ యువతి కోరింది. తన ముగ్గురు చెల్లెళ్ల బాధ్యత చూసేవారు ఎవరూ లేరని, వారికి తండ్రి అవసరమంటూ కన్నీళ్లతో ప్రాథేయపడింది. తల్లి తన గురించి చెడుగా చెప్పి రెచ్చగొట్టడంతోనే మద్యం మత్తులో ఉన్న తండ్రి అలా చేశాడని తెలిపింది. బంధువులపై నమ్మకం లేదన్న ఆ బాలిక తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.
అయితే ఆ బాలిక తిరిగి రావడంతో ఆమె తండ్రిపై నమోదు చేసిన హత్య కేసును హత్యాయత్నంగా మార్పు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
“3 months ago, her father threw her into a canal near #ferozepur for ‘honour’, filmed it & left her to die.
He’s been in jail for her ‘murder’.
Today she walked back alive.
She says: ‘Release my father from jail. My mother is the real culprit.’#HonorKilling #Punjab” pic.twitter.com/ZBXthtULwe— swaran danewalia (@danewaliaswaran) December 7, 2025
Also Read:
Bride asks for bulb on wedding night | తొలిరాత్రి వేళ బల్బు అడిగిన వధువు.. కంగారుపడి మాయమైన వరుడు
Watch: హైవేపై ఏనుగుల గుంపు హల్చల్.. వీడియో వైరల్