చెట్లకిందే ‘మధ్యాహ్న’ భోజనం
‘మన ఊరు మనబడి’లో భాగంగా గత కేసీఆర్ సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా చొప్పదండితోపాటు మండలంలోని పలు పాఠశాలల్లో డైనింగ్‌హాల్ నిర్మాణ పనులను చేపట్టింది. కానీ, రెండేళ్ల కింద ప్రభుత్వం మారడంతో నిర్లక్ష్యమే ఎదురైంది. కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
- చొప్పదండి మండలంలో అసంపూర్తిగా డైనింగ్‌హాళ్ల నిర్మాణం
చొప్పదండి, ఫిబ్రవరి 22: ‘మన ఊరు మనబడి’లో భాగంగా గత కేసీఆర్ సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా చొప్పదండితోపాటు మండలంలోని పలు పాఠశాలల్లో డైనింగ్‌హాల్ నిర్మాణ పనులను చేపట్టింది. కానీ, రెండేళ్ల కింద ప్రభుత్వం మారడంతో నిర్లక్ష్యమే ఎదురైంది. కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
కాంట్రాక్టర్లకు నిధులు విడుదల కాకపోవడంతో మధ్యలోనే ఆగిపోయాయి. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ పనులు 80 శాతం, బాలికల ఉన్నత పాఠశాలలో 90 శాతమే పూర్తయ్యాయి. గుమ్లాపూర్ పాఠశాలలోనూ అసంపూర్తిగానే ఉన్నాయి. రాగంపేటలో పిల్లర్ స్థాయిలోనే నిలిచిపోయాయి. దీంతో ఆయా స్కూళ్లలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
చొప్పదండిలో ఇలా చెట్ల కిందనే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. కోతల బెడదతో భోజన సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి తెచ్చిన డైనింగ్ టేబుళ్లు వినియోగం లేక తుప్పు పట్టి పట్టిపోతున్నాయి. డైనింగ్ హాల్‌ను కాంట్రాక్టర్ స్టోర్ రూంగా వాడడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై హెచ్ఎం వైద్యుల రాజిరెడ్డి మాట్లాడుతూ, పనులు ఆగి పోయిన మాట వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని, వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు డైనింగ్ హాల్‌ను వినియోగంలోకి తెస్తామని చెప్పారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

