Gold Price | బంగారానికి మళ్లీ రెక్కలు.. ఏడు వారాల గరిష్ఠానికి ధరలు
Gold Price | అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు (Gold Prices) ఇవాళ భారీగా పెరిగాయి. ఏడు వారాల గరిష్ఠ స్థాయికి చేరి ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ (ప్రభుత్వ బాండ్లపై రాబడులు) తగ్గడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపరులు (Investers) మొగ్గు చూపారు. పశ్చిమాసియా (West Asia) లో అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న సంకేతాలు వస్తున్నప్పటికీ పసిడి ధర పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
Gold Price : అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు (Gold Prices) ఇవాళ భారీగా పెరిగాయి. ఏడు వారాల గరిష్ఠ స్థాయికి చేరి ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ (ప్రభుత్వ బాండ్లపై రాబడులు) తగ్గడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపరులు (Investers) మొగ్గు చూపారు. పశ్చిమాసియా (West Asia) లో అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న సంకేతాలు వస్తున్నప్పటికీ పసిడి ధర పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో అక్టోబర్ 5న ముగియనున్న ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర ట్రేడింగ్ ప్రారంభంలోనే 10 గ్రాములకు రూ.536 పెరిగి రూ.1,49,029 పలికింది. ట్రేడింగ్ కొనసాగుతుండగా ఒకానొక దశలో రూ.1,207 లాభపడి గరిష్ఠంగా రూ.1,49,700 స్థాయిని తాకింది. మరోవైపు వెండి ధరల్లో మిశ్రమ స్పందన కనిపించింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.813 పెరిగి రూ.2,28,397 వద్ద గరిష్ఠ స్థాయికి చేరినప్పటికీ ఆ తర్వాత లాభాలను నిలుపుకోలేకపోయింది.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లోనూ ఔన్సు బంగారం ధర 0.36% వృద్ధితో 4,320 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇక ఔన్సు వెండి ధర 62.36 డాలర్ల వద్ద నిలకడగా ఉంది. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదరవచ్చన్న ఆశలు, హర్మూజ్ జలసంధిలో రాకపోకలు పునఃప్రారంభం కావచ్చన్న వార్తల నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గుతాయన్న అంచనాలు బలపడ్డాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 80 డాలర్ల దిగువకు పడిపోయింది. ముడి చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని, దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని మార్కెట్ భావిస్తోంది.
ఈ అంచనాలతో యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తగ్గాయి. బాండ్లపై రాబడులు తగ్గడంతో వడ్డీ రాని బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. ఇదే పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Encephalitis | పిల్లల్లో మెదడువాపు.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Bigg Boss 10 | హౌస్‌లో నామినేషన్ల మంటలు.. ముకేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన మిథిలేష్, వర్షిణిపై అపూర్వ సంచలన వ్యాఖ్యలు!
Study in USA | ట్రంప్ దెబ్బతో అమెరికా చదువులకు బైబై.. యూరప్‌కు వరుస కట్టిన విదేశీ విద్యార్థులు
Local Body Elections | ఎన్నికల జాప్యంతో కేంద్రం షాక్.. తెలంగాణకు రావాల్సిన రూ.1,700 కోట్లు పెండింగ్
Farmer | మంత్రి వివేక్ ఇలాకాలో రైతు ఆత్మహత్యాయత్నం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

