న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లైవ్ టీవీ స్క్రీన్‌లో కనిపించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారు. ప్రసంగించే ఎంపీల వెనుక ఉన్న సీట్లలోకి వారు మారారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Parliament’s Winter Session) పార్లమెంటు శీతాకాల సమావేశాల ఐదవ రోజు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు రుచి వీరా, కృష్ణ దేవి శివశంకర్ పటేల్ టీవీ వీక్షకుల దృష్టిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. సభలో చర్చల సమయంలో వీరిద్దరూ మాట్లాడలేదు. అయితే ఇతర ఎంపీల ప్రసంగాల్లో వారు కనిపించారు. ప్రత్యక్ష ప్రసారాల సమయంలో కెమెరా ఫ్రేమ్‌లో కనిపించేందుకు ఆ ఎంపీలు పదే పదే సీట్లు మారారు.
కాగా, రాజ్యసభలో కూడా ఇలాగే జరిగింది. ప్రసంగించే ఎంపీల వెనుక సీట్లలో కొందరు సభ్యులు సర్దుకుని కూర్చుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తి షేర్ చేశాడు. ‘ఎంపీలు ఇప్పుడు స్క్రీన్ టైమ్ కోసం కూడా పోటీ పడుతున్నారా?’ అని ప్రశ్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు పలు కామెంట్లు చేశారు.
On Day 5 of the Winter Session, Samajwadi Party MPs Ruchi Vira and Krishna Devi Shivshankar Patel were spotted doing something unusual. Not speaking. But subtly sliding into camera frames behind MPs who did. And wait till you see the Rajya Sabha’s camera chasers. pic.twitter.com/dWLTN9KFiX
— Muskan Singh (@totally_misfit) December 6, 2025
Also Read:
rabies infected cow dies | రేబిస్ సోకి ఆవు మృతి.. టీకా కోసం క్యూ కట్టిన గ్రామస్తులు
Watch: టోల్ ప్లాజా వద్ద కారును ఢీకొట్టిన థార్.. తర్వాత ఏం జరిగిందంటే?