న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. (Amit Shah vs Rahul) బుధవారం లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ప్రసంగాన్ని రాహుల్ గాంధీ అడ్డుకున్నారు. ఓటర్ల జాబితాల్లో జరిగిన అవకతవకలపై చర్చ జరుపాలని సవాల్ చేశారు. దీంతో అమిత్ షా ఎదురుదాడికి దిగారు. సభలో తాను ఏం మాట్లాడాలో అన్నది ఎవరూ నిర్దేశించలేరని అన్నారు.
కాగా, ఓటర్ల జాబితా నవీకరణ, అర్హత కలిగిన ఓటర్లను నిర్ధారించడం లక్ష్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) జరుగుతున్నదని అమిత్ షా తెలిపారు. ప్రతిపక్షాలు దీనిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు. ‘మీరు గెలిచినప్పుడు ఓటర్ల జాబితాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు కొత్త బట్టలు ధరించి ప్రమాణం చేస్తారు. కానీ బీహార్లో లాగా మీరు ఓడిపోయినప్పుడు ఓటర్ల జాబితాలో సమస్య ఉందని అంటారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు పని చేయవు’ అని ఆయన ఎగతాళి చేశారు.
మరోవైపు ఓటర్ల జాబితాలపై రాహుల్ గాంధీ నిర్వహించిన మీడియా సమావేశాలు, ఓటు చోరీని ‘హైడ్రోజన్ బాంబు’గా పేర్కొనడంపై అమిత్ షా మండిపడ్డారు. ‘ప్రతిపక్ష నాయకుడు ‘ఓటు చోరీ’ గురించి మాట్లాడారు. అయితే కొన్ని కుటుంబాలు తరతరాలుగా ఓటు దొంగలు’ అంటూ పరోక్షంగా నెహ్రూ, ఇందిరా గాంధీ కుటుంబాలను ఆయన విమర్శించారు.
Also Read:
Drunk Man Operate On Woman | యూట్యూబ్ చూసి.. మద్యం మత్తులో ఆపరేషన్ చేసిన వ్యక్తి, మహిళ మృతి
Police Kidnap Student | విద్యార్థిని కిడ్నాప్ చేసి.. నకిలీ డ్రగ్స్ కేసులో ఇరిగించిన పోలీసులు