బెంగళూరు: ఒక ప్రయాణికుడు ఏకంగా పరుపుతో ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండిగో విమానాల రద్దు, ఆలస్యంపై నెటిజన్లు సెటైర్లు వేశారు. (Passenger Arrives With Mattress) గురువారం ఒక ప్రయాణికుడు వీపు వెనుక మోస్తున్న పరుపుతో బెంగళూరు విమానాశ్రయంలోని టెర్మినల్‌లోకి ప్రవేశించాడు. మెట్రెస్ కొనుగోలు రసీదు, వారంటీ కార్డ్‌తో పాటు పవర్ బ్యాంక్‌ను వెంట తీసుకెళ్లాడు.
కాగా, ఒకరు రికార్డ్ చేసిన ఆ ప్రయాణికుడి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. ఇండిగో విమానం టికెట్ బుక్ చేసుకున్న ఆ ప్రయాణికుడు గంటలకొద్దీ ఆలస్యం కోసం అంతా సిద్ధమై వచ్చాడని ఒకరు వ్యాఖ్యానించారు. విమాన ప్రయాణికులు స్లీపర్ కోచ్ ప్రయాణికులుగా మారారని మరొకరు కామెంట్ చేశారు.
మరోవైపు సాధారణంగా రైళ్ల ఆలస్యం వల్ల ప్రయాణికులు ఫ్లాట్‌ఫారమ్‌పై నిద్రిస్తుంటారని, ఇప్పుడు ఎయిర్‌పోర్టులు కూడా రైల్వే స్టేషన్ల మాదిరిగా మారాయని ఒకరు విమర్శించారు. ఇండిగో విమానాల రద్దు, ఆలస్యం వల్ల విమాన ప్రయాణికులకు ఈ దుస్థితి ఏర్పడిందని మరొకరు ఆరోపించారు.
Flight Cancel Hui… Aur Yeh Banda Mattress Le Aaya! 😄🤣
“Airport me ek hilarious scene capture hua!
IndiGo ki flight cancel hone ke baad ek passenger ne apna solution nikal liya — aur saath me mattress le aaya! 😅#IndiGoCrisis #FunnyVideo #AirportFails #FlightCancelled pic.twitter.com/NAq8HDa67P— Trending Topics with Faiz (@newswithaftab14) December 10, 2025