న్యూఢిల్లీ: పేదల జీవన ప్రమాణాల పెంపునకు ఏడాదికి కనీస పని దినాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు రాష్ట్రీయ గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయించడం పట్ల విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మోదీ హయాంలో హిందీయేతర రాష్ర్టాలపై హిందీని బలవంతంగా రుద్దే మరో ప్రయత్నమే ఇదని అవి విమర్శించాయి. ‘