హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా, గాంధీ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు ప్రతి నెలా ప్రభుత్వం స్టైపెండ్ చెల్లించాల్సి ఉండగా.. మూడు నెలలుగా స్టైపెండ్ చెల్లించడం లేదు. దీంతో ప్రతి నెలా రూ.2,300 మెస్ చార్జీలు చెల్లించలేక,
ఇతర అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని నర్సింగ్ విద్యార్థు లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్‌ను వెంటనే విడుదల చేసి తమ ఆర్థిక కష్టాలు తీర్చాలని నర్సింగ్ విద్యార్థులు కోరుతున్నారు.