బెంగళూరు: మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు హంగామా చేశారు. రోడ్డుపై స్కూటర్ ఉంచి స్కూల్ బస్సును అడ్డుకున్నారు. అందులో ఉన్న ఒక విద్యార్థిని కిందకు దించాలని డ్రైవర్ను బలవంతం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Drunk Youths Stop School Bus) కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 8న మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు బసవనహళ్లి-వడ్దరహళ్లి రోడ్డులో స్కూటీని నిలిపారు. కిక్కేరి నుంచి చుట్టుపక్కల గ్రామాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డగించారు. అందులో ఉన్న 9వ తరగతి బాలికను బస్సు నుంచి దించాలని డ్రైవర్ను బలవంతం చేశారు. డ్రైవర్ను వారు దుర్భాషలాడారు. స్కూల్ సిబ్బందిని బెదిరించారు. దీంతో స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళన చెందారు.
కాగా, స్కూల్ బస్సు డ్రైవర్ రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. నిందితులను 20 ఏళ్ల గిరీష్, 20 ఏళ్ల కిరణ్గా గుర్తించి అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ యువకులు మద్యంతోపాటు గంజాయి సేవించిన మత్తులో ఉన్నట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు.
In #Mandya‘s #KRPete, a group of drunk miscreants stopped a private school bus, created a ruckus, and forced the driver to make a 9th-standard girl student get off the bus.
The incident occurred on the route from the #Kikkeri school to #Vaddarahalli.
The bus driver has recorded… pic.twitter.com/yi0IoQJF6z
— Hate Detector 🔍 (@HateDetectors) December 9, 2025
Also Read:
Man Branded Untouchable | దళిత ఇంట్లో భోజనం చేసిన వ్యక్తి.. ‘అంటరానివాడు’గా ముద్ర, అతడి కుటుంబం వెలి
Police Kidnap Student | విద్యార్థిని కిడ్నాప్ చేసి.. నకిలీ డ్రగ్స్ కేసులో ఇరిగించిన పోలీసులు
Watch: ఈ డబ్బు ఎవరిదని అడిగిన పాక్ స్పీకర్.. చేతులెత్తిన 12 మంది ఎంపీలు