ఇస్లామాబాద్: పాకిస్థాన్ పార్లమెంట్లో ఇటీవల వింత సంఘటనలు జరుగుతున్నాయి. ఆ దేశ జాతీయ అసెంబ్లీలోకి గాడిద ప్రవేశించి కలకలం రేపింది. తాజాగా సభలోని నేలపై పడిన డబ్బు ఎవరిదని స్పీకర్ అడిగారు. తమదే అంటూ 12 మంది ఎంపీలు చేతులెత్తారు. (Pakistan Speaker waves lost cash) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమవారం పాక్ జాతీయ అసెంబ్లీ హాల్లోని నేలపై రూ.5,000 విలువైన పది పాకిస్థాన్ కరెన్సీ నోట్లు కనిపించాయి.
కాగా, సభ్యుల నిజాయితీని పరీక్షించాలని స్పీకర్ అయాజ్ సాదిక్ భావించారు. ఆ నోట్లను చేతిలో పట్టుకుని పైకి ఎత్తి చూపించారు. నేలపై పడిన ‘ఈ డబ్బు ఎవరిది’? అని ఆయన అడిగారు. అయితే ఆ డబ్బు తమదంటూ సుమారు 12 మంది ఎంపీలు వెంటనే చేతులు పైకి ఎత్తారు. ఇది చూసి స్పీకర్‌తోపాటు సభలోని మిగతా సభ్యులు నవ్వుకున్నారు. ‘10 నోట్లు ఉన్నాయి. కానీ 12 మంది యజమానులు’ అంటూ స్పీకర్ ఎద్దేవా చేశారు.
మరోవైపు ఈ హాస్యభరిత సంఘటన నేపథ్యంలో సమావేశాలను కొంతసేపు నిలిపివేశారు. అయితే ఆ డబ్బు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఎంపీ ముహమ్మద్ ఇక్బాల్ అఫ్రిదిగా తేలింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం నుంచి ఆయన తీసుకున్నారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పాక్ ఎంపీల తీరుపై ఆ దేశానికి చెందిన నెటిజన్లు మండిపడ్డారు. వారి నిజాయితీపై పలు కామెంట్లు చేశారు.
Pak National Assembly Speaker asks whose money is lost and 10 to 15 members of Pakistan parliament raise their hands together. He even says the amount is not that big yet everyone wants to claim it. pic.twitter.com/rHUCOSDLcB
— The Story Teller (@IamTheStory__) December 9, 2025
Also Read:
Watch: పాక్ పార్లమెంట్ సమావేశాల్లో గాడిద.. వీడియో వైరల్
Watch: లైవ్ స్క్రీన్‌లో కనిపించేందుకు కొందరు ఎంపీల ఆరాటం.. సీట్లు మారిన వీడియో వైరల్
Police Kidnap Student | విద్యార్థిని కిడ్నాప్ చేసి.. నకిలీ డ్రగ్స్ కేసులో ఇరిగించిన పోలీసులు