న్యూఢిల్లీ, డిసెంబర్ 13: గుర్తింపు పొందని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు(ఆర్‌యూపీపీ) లేదా దాతృత్వ సంస్థలకు విరాళాలు ఇచ్చినట్లు రసీదులు సృష్టించి బోగస్ క్లెయిమ్స్ ద్వారా కొన్ని కంపెనీలు, పార్టీలు భారీ మొత్తంలో రీఫండ్లు పొందుతున్నట్లు గుర్తించినట్లు ఆదాయ పన్ను(ఐటీ) శాఖ శనివారం వెల్లడించింది.
ఆర్యూపీపీలలో చాలా పార్టీలు ఐటీ రిటర్న్‌లు ఫైల్ చేయడం లేదని, ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ఇటువంటి పార్టీల ద్వారా కొందరు వ్యక్తులు లెక్కల్లో చూపని నల్లధనాన్ని మార్చుకుంటున్నట్లు తమ విచారణలో సాక్ష్యాలు లభించినట్లు ఎక్స్ పోస్టులో ఐటీ శాఖ తెలిపింది. అదే విధంగా ఈ పార్టీలు కూడా విరాళాలకు నకిలీ రసీదులు ఇస్తున్నాయని వివరించింది.