బాన్సువాడ రూరల్, మార్చి 2 : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న రైతులందరూ ఒకేసారి సొసైటీకి తరలిరావడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొన్నది. ముందుగా సొసైటీ పరిధిలోని రైతులకు ఇచ్చిన తర్వాతనే ఇతర గ్రామాల రైతులకు ఇవ్వాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో సొసైటీ వద్ద రైతులు కొద్దిసేపు ఆందోళన చేపట్టారు.
తమ వద్ద చిన్న ఫోన్లు ఉన్నాయని, బుకింగ్ చేయడం రాదని వాపోయారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటలకు యూరియా అవసరమైన తరుణంలో లభిచండంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఎలాంటి నిబంధనలు లేకుండా యూరియా అందించాలని వారు కోరారు.