Suneil Anand: బాలీవుడ్ లెజెండ్, దివంగత దేవ్(Dev Anand) ఆనంద్ కుటుంబంలో విషాదం నెలకొంది. నటుడు, నిర్మాత అయిన ఆయన పెద్ద కుమారుడు సునీల్ ఆనంద్ (Suneil Anand) హఠాత్తుగా కన్నుమూశాడు. లండన్‌లో గుండెపోటు(Heart Attack)కు గురైన ఆయన 70 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచాడు. సునీల్ మరణవార్తను మంగళవారం ఆయన మేనకోడలు గినా నారంగ్ ఒక ప్రకటనలో మీడియాకు వెల్లడించింది.
ఒకప్పటి బాలీవుడ్ నటుడు దేవ్ ఆనంద్ పెద్ద కుమారుడు సునీల్ ఆనంద్ ఇకలేరు. జూలై 26, ఆదివారం గుండెపోటుతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అమెరికా నుంచి లండన్ మీదుగా విమానంలో భారత్ వస్తుండగా.. సునీల్‌కు గుండెపోటు వచ్చింది. దాంతో, వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. సునీల్‌ను పరీక్షించిన వైద్యులు స్టంట్ వేసి ప్రాణాలు కాపాడాలని అనుకున్నారు. కానీ, అంతలోపే ఆయనకు రెండోసారి గుండెపోటు వచ్చింది. డాక్టర్ల బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సునీల్‌ను బతికించలేకపోయారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 2011లో తన తండ్రి దేవ్ ఆనంద్ మరణించిన ఆస్పత్రిలోనే సునీల్ కూడా తుది శ్వాస విడిచాడు. ఈ ఏడాది జూన్ 30వ తేదీన ఆయన70వ ఏట అడుగుపెట్టాడు.
Suneil Anand, the 70-year-old son of Bollywood legend Dev Anand, has passed away in London following a heart attack. His niece and Dev Anand’s granddaughter, Gina Anand, confirmed the heartbreaking news and shared a statement on behalf of the family. She said the family is… pic.twitter.com/yCRf8x9T24
— India Forums (@indiaforums) July 28, 2026
‘సునీల్ ఆనంద్ మృతితో కుంటుబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. మా హృదయాలు బరువెక్కిపోయాయి. మీ అందరి మాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మద్దతుకు కృతజ్ఞులం. ఈ కష్ట సమయంలో మా గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నాం’ అని గినా నారంగ్ వెల్లడించింది. దేవ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఆనంద్ ఔర్ ఆనంద్’ (Anand Aur Anand) సినిమాతో 1984లో చిత్రసీమలో అడుగుపెట్టాడు సునీల్ ఆనంద్. అనంతరం కార్ థీఫ్, మైన్ తెరే లియె, మాస్టర్ వంటి సినిమాల్లో నటించాడు సునీల్.
Actor and filmmaker Suneil Anand, the son of legendary Hindi cinema icon Dev Anand and veteran actress Kalpana Kartik, passed away in London on July 26 at the age of 70 following a heart attack. His demise was confirmed through an official statement issued by his niece, Gina… pic.twitter.com/hP27kssElb
— The CSR Journal (@thecsrjournal) July 28, 2026