మన్సూరాబాద్, మార్చి 2: అర్థరాత్రి అతివేగంతో వచ్చిన కారు వెనుక నుంచి డీసీఎంను ఢీకొట్టిన ఘటనలో ఓ యవకుడు తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు పెట్రోల్ ట్యాంకుకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. వేగంగా కారు గుద్దడంతో డీసీఎం బోల్తా పడింది. ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్, రాక్‌టౌన్‌కాలనీకి చెందిన సాయికీర్తన రెడ్డి (24) వృత్తిరీత్యా వ్యాపారి. ఆదివారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి విందుకు వెళ్లిన అతడికి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదం జరిగింది.
ఆదివారం అర్థరాత్రి 1:30 లకు అతి వేగంగా.. నిర్లక్ష్యంగా బీఎండబ్ల్యూ కారును నడుపుతూ వచ్చిన సాయికీర్తన రెడ్డి బైరామల్‌గూడ ైఫె ్లఓవర్ పైన బొగ్గు లోడుతో వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టి.. ఫ్లైఓవర్ రెయిలింగ్‌కు తగిలి కారు నిలిచిపోయింది. డ్రైవింగ్ చేస్తున్న సాయికీర్తన రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. కారులో ఉన్న మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. అనంతపురంకు చెందిన డీసీఎం డ్రైవర్ రమేష్‌బాబు స్వల్పంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన సాయికీర్తన రెడ్డిని చికిత్స నిమిత్తం ఎల్బీనగర్లోని కామినేని దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కిమ్స్‌కు తరలించారు. ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.