న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నితిన్ నబిన్ను ఆ పార్టీ నియమించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ విషయాన్ని వెల్లడించారు. (Nitin Nabin) ఆయన నియామకాన్ని పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదించినట్లు పేర్కొన్నారు. నితిన్ నబిన్ పదోన్నతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పార్టీలో ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న అంకితభావంతో కూడిన కార్యకర్తగా ఆయనను అభివర్ణించారు.
కాగా, నితిన్ నబిన్ ప్రస్తుతం సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ఐదుసార్లు బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన కాయస్థ వర్గానికి చెందినవారు. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానాన్ని నితిన్ నబిన్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది.
Also Read:
Vijay Shah | మరోసారి నోరు జారిన మంత్రి.. లబ్ధిపొందే మహిళలు సీఎం సభలకు రావాలని డిమాండ్
Teacher Couple Die | పొగమంచు కారణంగా కాలువలో పడిన కారు.. ఉపాధ్యాయ దంపతులు మృతి
woman marries Krishna idol | కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన మహిళ.. ఎందుకంటే?