పాట్నా: ఒక రైల్వేస్టేషన్లో సుమారు 40 మంది ప్రయాణికులు రైలు ఎక్కారు. టాయిలెట్ డోర్ వద్ద వారు గుమిగూడారు. అందులో ఉన్న మహిళ బయటకు రాలేకపోయింది. ట్రైన్ టాయిలెట్లో చిక్కుకున్న ఆమె సహాయం కోసం అభ్యర్థించింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసింది. (Woman Trapped In Train Toilet) బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ ఒంటరిగా రైలులో ప్రయాణించింది. ఆమె టాయిలెట్‌కు వెళ్లింది.
కాగా, బీహార్‌లోని కతిహార్ జంక్షన్లో ఆ రైలులో ఆగింది. సుమారు 40 మంది యువకులు ఆ కంపార్ట్మెంట్లోకి ఎక్కారు. టాయిలెట్ డోర్ వద్ద గుడిగూడారు. ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో టాయిలెట్లో ఉన్న ఆ మహిళ ఆందోళన చెందింది. ఆమె బయటకు రాలేకపోయింది. అందులో చిక్కుకున్న ఆ మహిళ చివరకు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139ను కాంటాక్ట్ చేసింది. తన పరిస్థితిని వివరించింది.
మరోవైపు రైల్వే పోలీసులు స్పందించారు. ఆ కంపార్ట్మెంట్లోకి చేరుకున్నారు. టాయిలెట్ వద్ద గుమిగూడి ఉన్న యువకులను పక్కకు తొలగించారు. టాయిలెట్లో చిక్కుకున్న మహిళ బయటకు వచ్చి ఆమె సీటు వద్దకు వెళ్లేందుకు సహకరించారు. అయితే ఈ భయానక అనుభవం గురించి ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రయాణంలో మహిళలు ఎదుర్కొనే భద్రతా సమస్యలను తాను నిజంగా ఫేస్ చేసినట్లు అందులో వివరించింది. దీంతో నెజిటన్లు స్పందించారు. ఆ మహిళ ఆవేదనకు కొందరు మద్దతు తెలిపారు. ప్రయాణికుల రద్దీ నియంత్రించలేని రైల్వే తీరుపై మరి కొందరు మండిపడ్డారు.
Today I understood why safety concerns during travel feel so real.
I was travelling alone and my train stopped at Katihar Junction(Bihar). Suddenly 30–40 young men rushed into the coach, shouting and pushing each other.
I was in the washroom and couldn’t even step out-people were… pic.twitter.com/2N5KMNgOuh— Potato!🚩 (@Avoid_potato) December 10, 2025
Also Read:
Teacher Couple Die | పొగమంచు కారణంగా కాలువలో పడిన కారు.. ఉపాధ్యాయ దంపతులు మృతి
Watch: మత్తులో యువకులు హంగామా.. స్కూల్ బస్సును అడ్డుకుని బాలికను దించాలని బలవంతం