చండీగఢ్: దట్టమైన పొగమంచు కారణంగా కాలువలో కారు పడింది. అందులో ప్రయాణించిన ఉపాధ్యాయులైన దంపతులు మరణించారు. టీచర్ అయిన మహిళ ఎన్నికల విధుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. (Teacher Couple Die) పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాన్సా జిల్లాకు చెందిన జస్ కరణ్ సింగ్ ఇంగ్లీష్ టీచర్. ఆయనతో పాటు భార్య కమల్జీత్ కౌర్ కూడా మోగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.
కాగా, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం సంగత్పురా గ్రామంలోని పోలింగ్ బూత్‌లో ఎన్నికల విధులకు భార్య కమల్జీత్ కౌర్‌ను జస్ కరణ్ సింగ్ కారులో తీసుకెళ్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా వారి కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న కాలువలోకి అది దూసుకెళ్లింది. కాలువలో బోల్తా పడిన కారులో చిక్కుకున్న టీచర్ దంపతులు ఈ ప్రమాదంలో మరణించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలువలో పడిన కారు నుంచి ఉపాధ్యాయ దంపతుల మృతదేహాలను బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: మత్తులో యువకులు హంగామా.. స్కూల్ బస్సును అడ్డుకుని బాలికను దించాలని బలవంతం
Watch: ఎయిర్‌పోర్ట్‌లోకి పరుపుతో ప్రయాణికుడు.. ఇండిగో విమానాల ఆలస్యంపై నెటిజన్ల సెటైర్లు