బాలిక దారుణ హత్య
మైనర్ బాలిక హత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని గూడూరు శివారులోని ఇటుక బట్టీల వద్ద ఆదివారం చోటు చేసుకొంది.
- ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తే హంతకుడు
మిర్యాలగూడ రూరల్, మార్చి1 : మైనర్ బాలిక హత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని గూడూరు శివారులోని ఇటుక బట్టీల వద్ద ఆదివారం చోటు చేసుకొంది. రూరల్ సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం గూడూరు గ్రామ సమీపంలోని ఇటుక బట్టీల్లో ఒరిస్సాలోని బోలంగీర్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు కూలి పని చేస్తున్నారు. 17 సంవత్సరాల వారి కుమార్తెకు అదే ప్రాంతానికి చెందిన తబీరామ్తో ఐదు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో రెండు నెలల క్రితం ఇంట్లో చెప్పకుండా ఇద్దరూ పారిపో యినట్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు వివాహం జరిపిస్తామని చెప్పి, ఇద్దరినీ గూడూరుకు రప్పించారు. తబీరామ్ ప్రవర్తనను పరిశీలించిన తరువాత వివాహం చేస్తామని బాలిక తల్లిదండ్రులు హామీ ఇవ్వడంలో ఇద్దరూ ఇటుక బట్టీల్లో పనికి కుదిరారు. తబీరామ్కు మద్యం సేవించే అలవాటు ఉండటంతో బాలిక నిలదీసింది. ఇరువురు ఘర్షణ పడటంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను తబీరామ్ హత్య చేసి పారిపోతుండగా బాలిక తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా అపస్మారక స్థితితో ఉంది. వెంటనే ఆమెను దవాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

