లక్నో: ఒక మహిళ ఇటీవల బృందావనాన్ని సందర్శించింది. అక్కడ ఆమెకు బంగారు ఉంగరం ప్రసాదంగా లభించింది. దీంతో కృష్ణుడ్ని పెళ్లాడాలని నిర్ణయించింది. ఆ మహిళ కోరికను కుటుంబం కాదనలేకపోయింది. ఈ నేపథ్యంలో కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చి ఆమెకు పెళ్లి జరిపించారు. (woman marries Krishna idol) ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 28 ఏళ్ల పింకీ శర్మకు కుటుంబం పెళ్లి సంబంధాలు చూస్తున్నది. అయితే కృష్ణుడి భక్తురాలైన ఆమె ఆయన అనుగ్రహంతోనే తనకు పెళ్లి జరుగుతుందని తల్లిదండ్రులకు నచ్చజెబుతూ వచ్చింది.
కాగా, మూడు నెలల కిందట బృందావనంలోని బాంకే బిహారీ ఆలయాన్ని పింకీ శర్మ సందర్శించింది. అక్కడ ఆమెకు బంగారు ఉంగరం ప్రసాదంగా లభించింది. దీనిని దేవుడి సందేశంగా భావించింది. ఆ తర్వాత కృష్ణుడి పట్ల ఆమె భక్తి మరింతగా పెరిగింది. దీంతో కృష్ణుడ్ని తప్ప మరెవరినీ తాను పెళ్లి చేసుకోబోనని తల్లిదండ్రులకు స్పష్టం చేసింది.
మరోవైపు పింకీ నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు కాదనలేకపోయారు. పక్షం రోజుల కిందట బృందావనానికి వారు వెళ్లారు. అక్కడి నుంచి చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చారు. డిసెంబర్ 6న కృష్ణుడి విగ్రహంతో పింకీకి పెళ్లి చేశారు. పురోహితుడు రాంశంకర్ మిశ్రా హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి తంతు జరిపించారు. ఆ మరునాడు ఆ గ్రామంతా కలిసి పింకీకి వీడ్కోలు పలికారు. కృష్ణుడి మందిరంగా భావించే బావమరిది ఇంద్రేష్ శర్మ ఇంటికి సాగనంపారు. ఆమె భక్తిని మీరా బాయితో పోల్చారు.
కాగా, బృందావనంలో నివసించడమేనని తన ఏకైక కోరిక అని పింకీ తెలిపింది. కృష్ణుడి పూజ, ధ్యానం, ఆధ్యాత్మిక సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పింది. కృష్ణుడు ప్రతిదీ చూసుకుంటాడని తాను దృఢంగా నమ్ముతున్నానని పింకీ తెలిపింది. అందుకే ఖర్చులు లేదా జీవనోపాధి గురించి తాను ఆందోళన చెందడం లేదని పేర్కొంది. అయితే కృష్ణుడి విగ్రహాన్ని పింకీ పెళ్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
WATCH | ‘I Am the Real Meera’: UP Woman marries Lord Krishna idol in unusual ceremony.
After years of dedication, her family accepted her desire and performed the marriage with all ritiuals. pic.twitter.com/Xjo0HfJfhM
— The Tatva (@thetatvaindia) December 8, 2025
Also Read:
Teacher Couple Die | పొగమంచు కారణంగా కాలువలో పడిన కారు.. ఉపాధ్యాయ దంపతులు మృతి