Anti-Conversion Bill : రాజస్థాన్ (Rajasthan) లో బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు భజన్ లాల్ శర్మ (Bhajajlal Sharma) ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం బడ్జెట్ సమావేశాల వేదికగా రాజస్థాన్ చట్టవిరుద్ద మతమార్పిడి నిషేధ బిల్లు 2024 (రాజస్థాన్ ప్రోహిబిషన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజియన్ బిల్లు 2025) ను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోద ముద్ర వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అయితే గతేడాది అంటే 2024 నవంబర్‌లో ఈ బిల్లు ముసాయిదాను భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదించింది. మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్నవారు దాదాపు రెండు నెలల ముందు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలో తాము మత మార్పిడి చేసుకోవాలని తమ సొంతంగా నిర్ణయం తీసుకున్నామని జిల్లా ఉన్నతాధికారి ముందు ఒప్పుకోవాల్సి ఉంది. ఇందులో ఎవరి బలవంతం కానీ.. ఎవరి ప్రోద్బలం కానీ లేదని తెలుపాలి. అనంతరం మత మార్పిడికి అనుమతి లభిస్తుంది.
కాగా రాజస్థాన్‌లో బలవంతపు మత మార్పిడులు చోటుచేసుకొంటున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వాటిని నిరోధించేందుకు రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఒకవేళ షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన వారితోపాటు మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు ప్రోత్సహిస్తే.. రెండు నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల వరకు జరిమానా సైతం విధించే విధంగా ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే బలవంతపు మతమార్పిడులకు అడ్డుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇక ఈ మత మార్పిడి నిరోధక బిల్లుపై రాజస్థాన మంత్రి కేకే బిష్ణోయ్ మాట్లాడుతూ.. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. తద్వారా అమాయక బాలికలను ప్రలోభపెట్టడాన్ని ఆపవచ్చని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ.. తన ఎక్స్ ఖాతా వేదికగా కీలక ప్రకటన చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం అక్రమ మతమార్పిడికి అడ్డుకట్ట వేసేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Aghori | రాజన్న ఆలయంలో దర్గాను కూల్చేందుకు వెళ్లిన అఘోరీ.. అడ్డుకున్న పోలీసులు
Delhi elections | ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. 5న పోలింగ్‌కు సర్వం సిద్ధం
Crime news | భర్త వేధింపులు భరించలేకే విష్ణుజ ఆత్మహత్య.. అందంగా లేవంటూ బైక్ ఎక్కించుకోలేదు..!
Crime news | శృంగారం వేళ అతడిని ఊపిరాడకుండా చేసి చంపిన మహిళ.. ఎందుకంటే..!
MLC Election | ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే నామినేషన్లు షురూ
Election Commission | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత.. సుప్రీంకోర్టుకు కేటీఆర్
Shakeel Ahmad Khan | కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య.. Video