Crime news : కేరళ (Kerala) లో 25 ఏళ్ల మహిళ విష్ణుజ (Vishnuja) ఆత్మహత్యకు ఆమె భర్త పెట్టిన శారీరక, మానసిక వేధింపులే కారణమని పోలీసుల విచారణలో తేలింది. వారం రోజుల క్రితం మలప్పురం (Malappuram) లోని తన నివాసంలో విష్ణుజ ఉరేసుకుని చనిపోయింది. ఘటనపై పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే మృతురాలి తల్లిదండ్రులు భర్త వేధింపులే తమ కుమార్తె చావుకు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లుడే మా బిడ్డను హత్య చేశాడేమోనని వారు అనుమానం వ్యక్తం చేశారు.
దాంతో పోలీసులు ఆత్మహత్యకు పురికొల్పడం, మహిళలపై క్రూరత్వం నేరం కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. 2023 మే నెలలో విష్ణుజ, ప్రభిన్ల వివాహం జరిగింది. వారిది పెద్దలు కుదిర్చిన వివాహం. ప్రభిన్ ఆస్పత్రిలో మేల్ నర్సుగా పనిచేసే వాడు. వివాహం జరిగిన రోజు నుంచే ప్రభిన్ విష్ణుజను వేధించడం మొదలుపెట్టాడు. అందంగా లేవని, బక్కగా ఉన్నావని సూటిపోటీ మాటలు అనేవాడు. వెంట తీసుకెళ్తే నామోషీగా ఉంటుందని బైకు ఎక్కనిచ్చేవాడు కాదు. ఉద్యోగం చేయకుండా కూర్చుని తింటున్నావని వేధించేవాడు.
అయితే ఇవేవీ విష్ణుజ తన తల్లిదండ్రులకు చెప్పేది కాదు. దాంతో ప్రభిన్ ఆగడాలు మరింత పెరిగాయి. ఫ్రెండ్స్‌తో మాత్రం భర్త వేధింపుల గురించి చెప్పుకునేది. వాళ్లు పుట్టింటికి వెళ్లి పొమ్మని చెప్పినా వినిపించుకునేది కాదు. తాను తన భర్తను మార్చుకుంటానని చెప్పేది. ఈ క్రమంలోనే గత వారం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అల్లుడి నిజస్వరూపం తెలియకపోవడంతో విష్ణుజ పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
కానీ, ఆ తర్వాత విష్ణుజ స్నేహితుల ద్వారా ప్రభిన్ నిజస్వరూపం తెలుసుకున్న మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విష్ణుజ వాట్సాప్ నంబర్‌ను కూడా ప్రభిన్ తన మొబైల్‌తో లింక్ చేసుకున్నాడని, దాంతో ఆమె వాట్సాప్ ద్వారా తమతో భర్త గురించి ఏ విషయం షేర్ చేసేది కాదని ఆమె స్నేహితులు తెలిపారు. అయితే ప్రభిన్కు టెలిగ్రామ్ గురించి తెలియకపోవడంతో టెలిగ్రామ్ ద్వారా విష్ణుజ తమకు అతడి క్రూరత్వం గురించి చెప్పుకునేదని వెల్లడించారు.
ప్రభిన్ గురించి తెలుసుకున్న విష్ణుజ తండ్రి తన కూతరుది హత్యో, ఆత్మహత్యో అని అనుమానం వ్యక్తం చేశాడు. అల్లుడే తన కూతురును హత్యచేసి, ఉరి వేసి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన బిడ్డను ప్రభిన్ నిత్యం కొట్టేవాడని కూడా ఆమె స్నేహితుల ద్వారా తెలిసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
Crime news | శృంగారం వేళ అతడిని ఊపిరాడకుండా చేసి చంపిన మహిళ.. ఎందుకంటే..!
MLC Election | ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే నామినేషన్లు షురూ
Election Commission | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత.. సుప్రీంకోర్టుకు కేటీఆర్
Shakeel Ahmad Khan | కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య.. Video