MLC Election : వరంగల్ – ఖమ్మం – నల్గొండ (Warangal – Khammam – Nalgonda) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (Teachers MLC) ఎన్నికలకు నోటిఫికేషన్ (Notification) విడుదలైంది. నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila tripati) తెలిపారు. సోమవారం ఆమె వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయమైన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 3 నుంచి 10 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలలో నామినేషన్లు స్వీకరించబోమని చెప్పారు. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ చెప్పారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాను రిటర్నింగ్ అధికారిగా, నల్గొండ రెవెన్యూ అదనపు కలెక్టర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. క్లరికల్ అంశాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. అభ్యర్థులు అఫిడవిట్ సమర్పణ, అన్నేక్సర్ 26, ఫోటోల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ముసాయిదా జాబితా ప్రకారం 24,905 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు నల్గొండ సమీపంలోని అర్జాల బావి దగ్గరున్న మార్కెటింగ్ గోదాంలో ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ విషయమై ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపించనున్నట్లు ఆమె తెలిపారు.
Election Commission | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత.. సుప్రీంకోర్టుకు కేటీఆర్
Shakeel Ahmad Khan | కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య.. Video
Maha Kumbh Mela | వసంత పంచమి వేళ ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తిన భక్తులు.. పూలవర్షం కురిపించిన అధికారులు
AI University | దేశంలో తొలి ఏఐ వర్సిటీ.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే?
Maha Kumbh Mela | భక్తజనసంద్రంగా ప్రయాగ్‌రాజ్.. వసంత పంచమి అమృత స్నానాలు షురూ