Crime news : ఆమె తన ఇద్దరు పిల్లలు, భర్తతో నివసిస్తున్న గృహిణి (Home Maker). అతడు చీరలపై డిజైన్లు వేసే కళాకారుడు (Zari Zardoshi Artison) . అతడు ఊళ్లలో ఇంటింటికి తిరిగి చీరలపై డిజైన్లు వేస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఒకరికి ఒకరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత తరచూ ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అనంతరం ఇద్దరి మధ్య వివాహేతర బంధం (Extra marrital affair) ఏర్పడింది. కానీ చివరికి ఆమె శృంగార సమయంలోనే అతడిని ఊపిరాడకుండా చేసి చంపేసింది. మరి ఇద్దరి మధ్య ఏం జరిగింది..? ఆమెకు అతడిని చంపేంత కోసం ఎందుకొచ్చింది..? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం రాయ్‌బరేలీ (Bareilly) జిల్లాలో గత బుధవారం జరిగిన ఈ హత్య విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ గ్రామంలో 32 ఏళ్ల మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ఆమెకు ఇంటింటికి తిరిగి చీరలపై డిజైన్లు వేసే ఇక్బాల్ అనే కళాకారుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం రోజూ ఫోన్లు మాట్లాడుకునే పరిధిని దాటి, వివాహేతర బంధం పెట్టుకునే స్థాయికి వెళ్లింది. మొదట ఇష్టంతోనే వెళ్లినా తర్వాత ఆమె ఆ బంధానికి ముగింపు పలకాలని అనుకుంది.
అదే విషయాన్ని ఇక్బాల్‌తో చెప్పింది. కానీ ఇక్బాల్ అందుకు ఒప్పుకోలేదు. తనను దూరం పెడుతానంటే తన దగ్గర ఉన్న ఆడియో, వీడియో రికార్డింగ్‌లను ఆమె భర్తకు పంపిస్తానని బెదిరించాడు. ఆమె కుటుంబం చిన్నాభిన్నమవుతుందని హెచ్చరించాడు. దాంతో ఆమె అతడి బ్లాక్ మెయిలింగ్‌కు తలొగ్గి బంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కానీ విషయం బయటికి వస్తే తన సంసారం ఆగమవుతుందనే భయం ఆమెను వెంటాడసాగింది.
ఈ క్రమంలో ఇక్బాల్ తన భార్యను పుట్టింటి దగ్గర దించి వస్తూ ఆమెకు ఫోన్ చేశాడు. వస్తూవస్తూ ఆమె భర్తకు తేనీటిలో కలిపి పెట్టాలని నిద్ర మాత్రలు తెచ్చిచ్చాడు. తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని, నీ భర్త మత్తులోకి జారుకోగానే తన ఇంటికి రావాలని చెప్పాడు. ఆమె అతడు చెప్పినట్లుగానే చేసి, భర్త మత్తులోకి జారుకోగానే ఇక్బాల్ ఇంటికి బయలుదేరింది. వెళ్తూవెళ్తూ ఆమె తాను మనశ్శాంతిగా ఉండాలంటే ఇక్బాల్నైనా చంపాలి, తానైనా చావాలి నిర్ణయించుకుంది.
ఇక్బాల్ ఇంట్లోకి వెళ్లి అతడితో గడుపుతూనే అదును కోసం ఎదురు చూడసాగింది. శృంగార సమయంలోనే అతడి చేతులు ముందుకు రాకుండా ఛాతిపై కూర్చుని ఎడమ చేతితో ముక్కు, నోరు మూసింది. కుడి చేతితో గొంతు పిసికింది. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత పైకి లేచి, మృతదేహాన్ని అతడి ఇంటి మెట్లపైకి లాక్కొచ్చి వదిలేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఇంటికి వెళ్లిపోయింది. ఈ వివరాలను పోలీసుల ఇంటరాగేషన్‌లో ఆమే స్వయంగా వెల్లడించింది.
అంతకుముందు ఇంటి మెట్లపై ఇక్బాల్ మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళపై అనుమానంతో ఆమెను ప్రశ్నించారు. అయితే ఆమె తనకేమీ తెలియదని బుకాయించడంతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన స్టైల్లో ఇంటరాగేషన్ చేశారు. దాంతో ఆమె ఎలా హత్యకు పాల్పడిందో వివరించింది. ఇక్బాల్ బ్లాక్ మెయిలింగ్తో తాను విసిగిపోయానని, మరో దారిలేకనే హత్యకు పాల్పడ్డానని చెప్పింది.
MLC Election | ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే నామినేషన్లు షురూ
Election Commission | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత.. సుప్రీంకోర్టుకు కేటీఆర్
Shakeel Ahmad Khan | కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య.. Video